News August 17, 2024
HYD: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘కోడింగ్’పై శిక్షణ

అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు కార్పొరేట్ స్కూళ్ల తరహాలో హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులకు ‘కోడింగ్’పై శిక్షణ ఇస్తున్నారు. ఐదో తరగతి విద్యార్థులకు కోడింగ్ నేర్పిస్తున్నారు. బషీర్ బాగ్‌లోని మహబూబియా ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సులభంగా ఐప్యాడ్, ల్యాప్‌టాప్‌లను ఆంగ్లభాష సంకేతాలు, పదాలతో వాడుతున్నారు. ఐటీ సంస్థల ఉద్యోగులు, యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉచితంగా పాఠాలు చెబుతున్నారు.
Similar News
News October 29, 2025
CM సాబ్తో ఆర్.నారాయణ మూర్తి మాట

యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్లో సినీ కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డిని ఆర్.నారాయణ ఆలింగనం చేసుకున్నారు. సినిమాలో డైలాగ్ చెప్పినట్లు, ఓ పాట పాడినట్లు ఆర్.నారాయణ మూర్తి తన శైలిలో CM రేవంత్‌తో ఏదో మాట్లాడారు.
News October 29, 2025
గంజాయి లేడి డాన్ అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్ గంజాయి లేడీ డాన్‌గా పేరుగాంచిన అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురైంది. పీడీ యాక్ట్‌పై ఆమె వేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ధూల్‌పేట్ నుంచి గంజాయి వ్యాపారం నిర్వహిస్తూ అనేక కేసుల్లో నిందితురాలైన అంగూర్ భాయ్‌పై ప్రభుత్వం అమలు చేసిన పీడీ యాక్ట్‌ను సమర్థిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుపై ఎక్సైజ్ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.
News October 28, 2025
HYD: చీకటైనా పిల్లలు ఇంటికి రాలేదు.. పట్టించుకోరా?

యాచారం మం.లోని తాటిపర్తికి వెళ్లే బస్సు సకాలంలో రాకపోవడంతో బస్టాండ్‌లోనే విద్యార్థులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. నిత్యం ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతోన్నా పాలకులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యార్థులు గమ్యస్థానాలకు చేరేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నేడు కొందరు లిఫ్ట్ అడిగి వెళ్లారు. మరికొందరు బస్టాండ్‌లో నిరీక్షించడం గమనార్హం. పాలకులకు పట్టవా? అన్న విమర్శలొస్తున్నాయి.


