News October 7, 2024

HYD: ప్రముఖ కట్టడాలన్నీ FTL పరిధిలోనే ఉన్నాయి: ఒవైసీ

image

సచివాలయం, బాపు ఘాట్‌తో పాటు ఎన్నో ప్రముఖ కట్టడాలు కూడా FTL పరిధిలోనే ఉన్నాయని HYD ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. సచివాలయం FTL పరిధిలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది.. పేదల ఇళ్లు ఉంటే ఎందుకని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కూల్చివేతల్లో పేదలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ హామీల్లో పేదల సంక్షేమం కూడా ఉందని.. మర్చిపోవద్దని ఒవైసీ పేర్కొన్నారు.

Similar News

News November 11, 2024

హైదరాబాద్‌లో పెరిగిన చలి!

image

హైదరాబాద్‌లో రోజు రోజుకు చలి పెరుగుతోంది. ఉదయం చాలాచోట్ల పొగమంచు కురుస్తోంది. పటాన్‌చెరు, హయత్‌నగర్, బేగంపేట, దుండిగల్, రాజేంద్రనగర్‌, ముషీరాబాద్, ఓయూలో 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కోఠి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్ వంటి ఏరియాల్లో స్వెట్టర్ల దుకాణాలకు గిరాకీ పెరిగింది.

News November 11, 2024

HYD: శంషాబాద్‌కు అఘోరీ

image

శంషాబాద్‌లో ధ్వంసమైన పోచమ్మ గుడి వద్ద తాను మహాతాండవం ఆడబోతున్నట్లు అఘోరి ప్రకటించారు. ఏపీ గుంటూరు జిల్లాలోని కోటప్ప స్వామి ఆలయం వద్ద ఆమె ఆదివారం మాట్లాడారు. స్త్రీ శక్తి బయటకు వస్తే ఎవరూ తట్టుకోలేరన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడితే మగాళ్ల మర్మాంగాన్ని కోసేస్తానని హెచ్చరించారు. మహిళల కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు.

News November 11, 2024

నేడు HYDలో వాటర్ బంద్

image

రాజధాని వాసులకు ముఖ్య గమనిక. నేడు నగరంలోని పలు ఏరియాల్లో నీటి సరఫరా ఉండదు. వాటర్‌ పైప్‌లైన్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 వరకు వాటర్ సప్లై నిలిపివేస్తున్నారు. అమీర్‌పేట్, SRనగర్, ఎర్రగడ్డ, మూసాపేట, కూకట్‌పల్లి, KPHB, RCపురం, లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, అమీన్‌పూర్, జగద్గిరిగుట్ట ఏరియాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. SHARE IT