News April 29, 2024

HYD: ప్రాణాలు కాపాడిన పోలీస్‌కు సత్కారం

image

ట్యాంక్‌బండ్‌‌‌లో దూకి ఆత్మహత్యకు‌ యత్నించిన ఓ మహిళను TSSP కానిస్టేబుల్ అశోక్ కాపాడిన విషయం తెలిసిందే. అశోక్‌ అప్రమత్తత పట్ల అక్కడి వారు ప్రశంసలు కురిపించారు. సోమవారం TSSP అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా కానిస్టేబుల్ అశోక్‌‌ని కలిసి అభినందించారు. విధి నిర్వహణ పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రశంసించారు.

Similar News

News October 14, 2025

BREAKING: HYD: మీర్‌పేట్ మంత్రాల చెరువులో మహిళ మృతదేహం కలకలం

image

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంత్రాల చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని పోలీసులు ఈరోజు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న మిస్సింగ్ కేసులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు.

News October 14, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మహిళల ఓట్లే కీలకం..!

image

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పురుషుల ఓట్లు వివిధ పార్టీలకు డివైడ్ అయ్యే అవకాశం ఉన్నా మహిళల ఓట్లు మాత్రం ఒకే పార్టీకి గంప గుత్తగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 3,98,982ఓటర్లు ఉండగా అందులో 1,91,590మంది మహిళా ఓటర్లే ఉన్నారు. కాగా ఫ్రీబస్సు స్కీమ్‌తో‌ మహిళలు తమకే ఓట్లు వేస్తారని కాంగ్రెస్ నేతలు అంటుండగా గతంలో బతుకమ్మ చీరలిచ్చిన KCRవైపే మహిళలు ఉన్నారని BRSనేతలు చెబుతున్నారు.

News October 14, 2025

బల్కంపేట ఎల్లమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

image

HYD బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వివిధ పుష్పాలు, పట్టు చీరతో అలంకరించి, పంచ హారతులు, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.