News July 21, 2024

HYD: ప్రాణాలు కాపాడేందుకు నూతన టెక్నాలజీ!

image

గ్రేటర్ HYDలో వరదలు ముంచెత్తినప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు DRF ఆధ్వర్యంలో నూతన టెక్నాలజీ వాడనున్నారు. ఇందులో భాగంగానే ఫైర్ ఫైటింగ్ రోబోట్లు, సోనార్ స్కానర్, రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్, టెక్నాలజీ యూనిట్‌లను అందుబాటులోకి తేనున్నారు. ఈ టెక్నాలజీ సాయంతో ఆపదలో ఉన్నవారిని కాపడటమే కాకుండా క్లిష్ట పరిస్థితుల్లో సిబ్బందికి ప్రత్యామ్నాయంగా సహకరిస్తుంది.

Similar News

News October 20, 2025

21న పోలీస్ అమరవీరుల సంస్మరణకు సీఎం రేవంత్: డీజీపీ

image

అక్టోబర్ 21 గోషామహల్ పోలీస్ స్టేడియంలో జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి హాజరవనున్నారని డీజీపీ శివధర్ తెలిపారు. కార్యక్రమం ఉ.9.30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. అక్టోబర్ 21- 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

News October 20, 2025

HYD సెంట్రల్ జోన్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్& డ్రైవ్ తనిఖీలు

image

హైదరాబాద్ సెంట్రల్‌ జోన్‌ ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌& డ్రైవ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, మైనర్‌ డ్రైవింగ్‌ కేసులపై కఠిన చర్యలు చేపట్టారు. 212 మంది డ్రంక్‌& డ్రైవ్‌ నిందితులకు ₹6.79 లక్షల జరిమానా, 25 మందికి నాంపల్లి కోర్టు జైలుశిక్ష విధించింది. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌పై ₹1.61 లక్షలు, మైనర్‌ డ్రైవింగ్‌పై ₹14,700 జరిమానా విధించారు. ట్రాఫిక్‌ భద్రతకు ప్రజలు కట్టుబడి ఉండాలని పోలీసులు సూచించారు.

News October 20, 2025

HYD: ట్రేడింగ్ మోసగాడు సుల్తాన్ అరెస్ట్

image

హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్‌ మోసాల్లో పాల్గొన్న కందుకూరు సుల్తాన్‌ అహ్మద్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు. ఈయన నకిలీ బ్యాంక్‌ ఖాతాలను కమిషన్‌ మీద అందించి దేశవ్యాప్తంగా సైబర్‌ మోసాలకు తోడ్పడ్డాడు. సుమారు ₹3 కోట్లు మోసం చేసినట్టు గుర్తించారు. దేశవ్యాప్తంగా 15కేసులు నమోదయ్యాయి. మొబైల్‌ ఫోన్లు, డెబిట్‌ కార్డులు స్వాధీనం చేసుకుని బ్యాంక్‌ ఖాతాలను పరిశీలిస్తున్నారు.