News August 21, 2024
HYD: ‘ప్రైవేటు టీచర్స్, ఉద్యోగుల రక్షణకు చట్టం కావాలి’

ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రావాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. అప్పుడే కోర్టుల్లో తమ హక్కుల కోసం పోరాడవచ్చని చెప్పారు. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ అధ్యక్షతన ‘విద్యాభివృద్ధి-ప్రైవేట్ ఉపాధ్యాయుల పాత్ర’ అన్న అంశంపై మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Similar News
News November 26, 2025
BIG BREAKING: HYDలో బోర్డు తిప్పేసిన IT కంపెనీ

హైదరాబాద్‌లో మరో ఐటీ కంపెనీ ఘరానా మోసం బయటపడింది. మాదాపూర్‌లోని NSN ఇన్ఫోటెక్లో శిక్షణ–ఉద్యోగం పేరుతో రూ. లక్షల్లో వసూలు చేశారు. 400 మందిలో ఒక్కొక్కరి నుంచి రూ.2 నుంచి 3 లక్షల వరకు వసూళ్లు చేసి, చివరకు బోర్డు తిప్పేసినట్లు బాధితులు వాపోయారు. కంపెనీ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. బాధితులు మాదాపూర్ PS, సైబరాబాద్ EOWలో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News November 26, 2025
నగరం.. మహానగరం.. విశ్వనగరం

అప్పట్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఇదీ సిటీ పరిస్థితి. ఇక ఔటర్ చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు గ్రేటర్లో కలిసిన తర్వాత విశ్వనగరంగా మారనుంది. జనాభా కూడా భారీగానే పెరిగే అవకాశముంది. ప్రస్తుతం గ్రేటర్ జనాభా 1.40 కోట్లు ఉండగా విలీనం తర్వాత 1.70 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.
News November 26, 2025
రేపు BRS హైదరాబాద్ కీలక సమావేశం

BRS హైదరాబాద్ జిల్లా కీలక సమావేశం రేపు (గురువారం) జరుగనుంది. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హాజరుకానున్నారని తలసాని తెలిపారు. ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ వేడుకల గురించి సమావేశంలో చర్చించనున్నారు.


