News September 9, 2024

HYD: ఫస్ట్ ఫేజ్‌లో 21,505 మందికి సీట్ల కేటాయింపు

image

పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 28,323 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, వాటిలో 21,505మందికి సీట్లు అలాట్ చేసినట్టు సీపీగెట్ ప్రొఫెసర్ ఐ.పాండు రంగారెడ్డి చెప్పారు. దీనిలో అమ్మాయిలు 15,694మంది ఉండగా, అబ్బాయిలు 5,811మంది ఉన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల13 లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు.

Similar News

News December 6, 2025

HYD: పురపాలికల విలీనంతో “చెత్త” సమస్యలు!

image

జీహెచ్ఎంసీలో 27 పురపాలిక సంస్థలు విలీనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెత్త నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఉన్న అధికారులు వీటికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఇంత మంది అధికారులు ఉన్నా సరే పాత జీహెచ్ఎంసీలో చెత్త నిర్వహణ అంతంత మాత్రంగానే ఉండేది. కొత్త ప్రాంతాలు రావడంతో ఇక పరిస్థితి ఎలా ఉంటుందని గుబులు మొదలైంది. వీటి కోసం కొత్త వారిని నియమిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు.

News December 6, 2025

HYD: మహా GHMC‌లో 250 డివిజన్లు.!

image

గ్రేటర్‌లో శివారు ప్రాంతాలు విలీనమైన నేపథ్యంలో డివిజన్‌ల పునర్విభజన జరుగుతోంది. స్థానిక సంస్థలను డివిజన్‌లను జీహెచ్ఎంసీ అధికారులు మారుస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోకి కొత్తగా 50 డివిజన్లు చేరనున్నాయి. వీటితో జీహెచ్ఎంసీలో 220 నుంచి 250 వరకు డివిజన్‌లు అవనున్నాయి. ఇప్పటికే జనాభా లెక్కన డివిజన్లను విభజించారు. దీంతో మహా జీహెచ్ఎంసీ 10 జోన్లు, 50 సర్కిళ్ళుగా మారుతుంది.

News December 6, 2025

HYD: HMDA వేలంపాట్లతో రూ.3,862.8 కోట్ల ఆదాయం!

image

​హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) తన చారిత్రక భూ వేలంపాట్ల సిరీస్‌ను విజయవంతంగా ముగించింది. ఇటీవల 1.98 ఎకరాల గోల్డెన్‌మైల్ స్థలాన్ని COEUS ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్క ఎకరాకు రూ.77.75 కోట్లకు పొందింది. ఈ ఫలితంతో, వేలంపాట్ల ద్వారా HMDA మొత్తం ఆదాయం రూ.3,862.8 కోట్లకు చేరింది.