News February 10, 2025
HYD: ఫిబ్రవరి 15తో ముగియనున్న నుమాయిష్

HYD నాంపల్లిలో జనవరి 3న 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్) ప్రారంభమైంది. ఫిబ్రవరి 15తో ఈ ప్రదర్శనకు తెరపడనుందని నిర్వహకులు తెలిపారు. మరో 2 రోజుల పాటు ప్రదర్శనను కొనసాగించేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఎగ్జిబిషన్ సొసైటీ కోరింది. కానీ HYD సీపీ సీవీ ఆనంద్ ఇందుకు నిరాకరించారు.
Similar News
News October 18, 2025
రంగారెడ్డి: నేటితో ముగియనున్న వైన్స్ టెండర్ల స్వీకరణ

రంగారెడ్డి జిల్లాలో 138 మద్యం దుకాణాలకు 4,200కిపైగా దరఖాస్తులు అందినట్లు DPEO ఉజ్వల రెడ్డి తెలిపారు. సరూర్నగర్లో 32కి 1,210, హయత్నగర్ 28కి 1,400, ఇబ్రహీంపట్నంలో 19కి 350, మహేశ్వరంలో 14కి 530, ఆమనగల్లో 17కి 230, షాద్నగర్లో 28కి 500 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. ఈరోజు చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. సా.5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనున్నట్లు తెలిపారు.
News October 18, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిపై రంగారెడ్డి కలెక్టర్ సమీక్ష

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్పష్టమైన పురోగతి సాధించాలని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో ఇబ్రహీంపట్నంలోని కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. మండలాల వారీ మంజూరైన ఇళ్ల సంఖ్య, గ్రౌండింగ్, నిర్మాణ దశల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెనుకంజలో ఉన్న మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News October 17, 2025
రంగారెడ్డి: స్వీట్ షాప్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్

దీపావళి పండుగ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని స్వీట్స్ తయారీ కేంద్రాల్లో జిల్లా ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేపట్టారు. తయారీకి ఉపయోగించే పదార్థాలు, నాణ్యతపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ప్రజలు స్వీట్స్ కొనేముందు వాటి నాణ్యతను గమనించి కొనాలని, తినే పదార్థాల్లో నాణ్యత లోపిస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. జోనల్ ఆఫీసర్ ఖలీల్, జిల్లా అధికారి మనోజ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జగన్ పాల్గొన్నారు.