News February 6, 2025
HYD: ఫిబ్రవరి 17 వరకు నుమాయిష్

హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్. నాంపల్లి మైదానంలో నిర్వహిస్తున్న నుమాయిష్ను మరో రెండు రోజులు పొడిగించారు. జనవరి 1కి బదులు 3న ప్రారంభమైన ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15న ముగియాల్సి ఉంది. అయితే, రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమైన నుమాయిష్ ఫిబ్రవరి 17న ముగుస్తుందని ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తెలిపారు. నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT
Similar News
News November 15, 2025
HYD: ఆధ్యంతం నాటకీయం.. చివర్లో తారుమారు

జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థుల ప్రకటనుంచి రిజల్ట్స్ వరకు నాటకీయంగా సాగింది. ప్రభుత్వంపై సర్వేల్లో, ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. మరోవైపు సిట్టింగ్, సెంటిమెంట్, ఎర్లీక్యాంపెయిన్ చేసిన BRSకు 10% ఆధిక్యత కనిపించింది. కానీ క్రమంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. గ్రౌండ్ వర్క్లో BRS తేలిపోగా, కాంగ్రెస్ అంచనాలను తలకిందులు చేస్తూ సక్సెస్ అయిందనేది విశ్లేషకుల మాట. దీనిపై మీ కామెంట్.
News November 14, 2025
హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల వన్ టైం చాన్స్ పరీక్షా తేదీల ఖరారు

ఓయూ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) వన్ టైం చాన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సుల అన్ని సెమిస్టర్ల వన్ టైం చాన్స్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబసైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
News November 14, 2025
HYD: 3ఏళ్లకే రికార్డులు కొల్లగొడుతున్న కార్తీక్ సూర్య

వనస్థలిపురంలోని IT ఉద్యోగి ప్రశాంత్, నీరజ కొడుకు కార్తీక్ సూర్య(3)కు 16 నెలల వరకు మాటే రాలే. 3 ఏళ్ల వయసులో అంకెలు గుర్తించి తల్లిని అడిగి తెలుసుకునేవాడు. వారి పెంపకంలో రోజుల వ్యవధిలోనే పెద్ద అంకెలతో కూడిక, తీసివేత, శాతాలు చేయడం మొదలెట్టాడు. కఠిన పదాలకు క్షణాల్లో నోటితోనే కచ్చితమైన సమాధానం చెప్తాడు. ఇండియా, నోబుల్, కిడ్స్, తెలంగాణ, తెలుగు, వరల్డ్ వైడ్, కలాం వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్నాడు.


