News February 6, 2025

HYD: ఫిబ్రవరి 17 వరకు నుమాయిష్

image

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్. నాంపల్లి మైదానంలో నిర్వహిస్తున్న నుమాయిష్‌ను మరో రెండు రోజులు పొడిగించారు. జనవరి 1కి బదులు 3న ప్రారంభమైన ఎగ్జిబిషన్‌ ఫిబ్రవరి 15న ముగియాల్సి ఉంది. అయితే, రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమైన నుమాయిష్ ఫిబ్రవరి 17న ముగుస్తుందని ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తెలిపారు. నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT

Similar News

News November 20, 2025

పెరిగిన చలి.. కోళ్ల సంరక్షణలో జాగ్రత్తలు(2/2)

image

కోళ్లకు తాజా నీరు, దాణా మాత్రమే అందించాలి. కోళ్ల దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. దాణా బస్తాలను గోడలకు తగలకుండా చూడాలి. తేమ ఉన్న దాణా నిల్వ చేయకూడదు. బాగా ఎండిన దాణాను మాత్రమే నిల్వ ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనల మేరకే తగిన మోతాదులో ఆక్సిటెట్రాసైక్లిన్‌, సల్ఫాడిమిడిన్ వంటి యాంటీ బయాటిక్స్‌, ఇతర శానిటైజర్లు, విటమిన్‌లు, దాణా నీరు ఇవ్వాలి. కోళ్లకు అవసరమైన టీకాలు వేయించాలి.

News November 20, 2025

భక్తులకు TTD ఛైర్మన్ విజ్ఞప్తి ఇదే..!

image

గుర్తు తెలియని సంస్థలకు విరాళాలు ఇచ్చి వారి ఉచ్చులో పడవద్దని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. ‘గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, Savetemples.org ముసుగులో కొంతమంది వ్యక్తులు భక్తులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. చట్టవిరుద్ధమైన విరాళాలను కోరుతూ మోసగిస్తున్నట్లు నాకు తెలిసింది. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలి’ అని ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు.

News November 20, 2025

రెండో సారి తల్లి కాబోతున్న హీరోయిన్

image

బాలీవుడ్ హీరోయిన్, ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ రెండో సారి తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశారు. బేబీ బంప్‌తో పింక్ కలర్ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చారు. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ 2022లో కుమారుడికి జన్మనిచ్చారు. అతడికి ‘వాయు’ అని నామకరణం చేశారు. సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూతురే సోనమ్.