News February 6, 2025

HYD: ఫిబ్రవరి 17 వరకు నుమాయిష్

image

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్. నాంపల్లి మైదానంలో నిర్వహిస్తున్న నుమాయిష్‌ను మరో రెండు రోజులు పొడిగించారు. జనవరి 1కి బదులు 3న ప్రారంభమైన ఎగ్జిబిషన్‌ ఫిబ్రవరి 15న ముగియాల్సి ఉంది. అయితే, రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమైన నుమాయిష్ ఫిబ్రవరి 17న ముగుస్తుందని ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తెలిపారు. నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT

Similar News

News July 8, 2025

JGTL: ‘90% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి’

image

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. GOVT. ఆసుపత్రులలో డెలివరీలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 3నెలల్లో ప్రభుత్వాసుపత్రులలో డెలివరీల సంఖ్య తక్కువగా ఉందని, సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. వచ్చే 3నెలల్లో 90% డెలివరీలు ప్రభుత్వాసుపత్రిల్లోనే జరిగేటట్లు చూడాలన్నారు. DMHO పాల్గొన్నారు.

News July 8, 2025

యాప్స్‌లో మోసం.. నాలుగింతలు వసూలు!

image

రైడ్ పూలింగ్ యాప్స్‌ల దోపిడీపై ఓ మహిళ చేసిన ట్వీట్ వైరలవుతోంది. బెంగళూరుకు చెందిన మహిళ 2.6kms వెళ్లేందుకు ఆటో బుక్ చేయగా రూ.172.45 చూపించింది. అదే దూరానికి డైరెక్ట్‌గా ఆటోలో వెళ్తే రూ.39 ఛార్జీని తీసుకున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. దీంతో యాప్స్‌లో జరుగుతున్న మోసాలపై చర్చ మొదలైంది. Ola, Rapido, Uber వంటి యాప్స్‌లో స్కామ్స్ జరుగుతున్నాయని, తామూ ఈ వ్యత్యాసాన్ని గమనించినట్లు పలువురు చెబుతున్నారు.

News July 8, 2025

కామవరపుకోట: బస్సు ఢీకొని ఒకరు మృతి

image

కామవరపుకోట మండలం తడికలపూడి శ్రీనివాస వేబ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన యాక్సిడెంలో ఒకరు మృతి చెందారు. ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.