News February 6, 2025
HYD: ఫుడ్ ఆర్డర్.. బిర్యానీలో ఈగ
ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ పెట్టిన కస్టమర్ షాకయ్యాడు. బాధితుడు రామకృష్ణ వివరాలు.. ‘చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాను. భోజనం తినే సమయంలో అందులో చనిపోయిన ఈగ దర్శనమిచ్చింది. కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశాను. హోటల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇటువంటి హోటల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అంటూ Way2Newsకు తెలిపారు.
Similar News
News February 6, 2025
పెద్దఅంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి
పెద్దఅంబర్‌పేట్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల ప్రకారం.. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్లో రిత్విక LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పసిపాప బస్సు కింద పడి నలిగిపోయిందని వారు వాపోయారు.
News February 6, 2025
తీన్మార్ మల్లన్నపై మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు
కాంగ్రెస్‌కి చెందిన MLC తీన్మార్ మల్లన్నపై కరీంనగర్ రెడ్డి ఐక్య సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ ఫిర్యాదు చేశారు. రెడ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నను MLC పదవికి అనర్హుడిగా ప్రకటించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం అని హెచ్చరించారు.
News February 6, 2025
సికింద్రాబాద్: మెట్టుగూడలో దారుణం
సికింద్రాబాద్ మెట్టుగూడలో దారుణ ఘటన వెలుగుచూసింది. చిలకలగూడ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న రేణుక(55), ఆమె కుమారుడు యశ్వంత్ (30)పై ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తల్లి కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.