News February 6, 2025
HYD: ఫుడ్ ఆర్డర్.. బిర్యానీలో ఈగ
ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ పెట్టిన కస్టమర్ షాకయ్యాడు. బాధితుడు రామకృష్ణ వివరాలు.. ‘చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాను. భోజనం తినే సమయంలో అందులో చనిపోయిన ఈగ దర్శనమిచ్చింది. కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశాను. హోటల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇటువంటి హోటల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అంటూ Way2Newsకు తెలిపారు.
Similar News
News February 6, 2025
సికింద్రాబాద్: మెట్టుగూడలో దారుణం
సికింద్రాబాద్ మెట్టుగూడలో దారుణ ఘటన వెలుగుచూసింది. చిలకలగూడ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న రేణుక(55), ఆమె కుమారుడు యశ్వంత్ (30)పై ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తల్లి కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 6, 2025
గచ్చిబౌలిలో కాల్పులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్ (UPDATE)
గచ్చిబౌలి ప్రీజం పబ్ కాల్పుల కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాఫ్ట్వేర్ ఇంజినీర్ రంజిత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను అరెస్టు చేశారు. అతడికి ఆశ్రయం ఇచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ చోరీ చేసిన డబ్బును రంజిత్ బ్యాంకు ఖాతాలో జమ చేసేవాడని పోలీసులు వెల్లడించారు.
News February 6, 2025
సర్పంచ్ ఎన్నికలు: రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు
గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన రంగారెడ్డిలో అసెంబ్లీ నియోజకవర్గాలు 8, కార్పొరేషన్లు 3, మున్సిపాలిటీలు 15 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-21, MPP-21, MPTC-232, గ్రామ పంచాయతీలు-526, వార్డులు 4896 ఉన్నాయి. గతంలో 257గా ఉన్న MPTCల సంఖ్యను 232కు అధికారులు తగ్గించారు. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.