News February 6, 2025

HYD: ఫుడ్ ఆర్డర్.. బిర్యానీలో ఈగ

image

ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ పెట్టిన కస్టమర్ షాకయ్యాడు. బాధితుడు రామకృష్ణ వివరాలు.. ‘చాదర్‌ఘాట్‌‌లోని ఓ హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాను. భోజనం తినే సమయంలో అందులో చనిపోయిన ఈగ దర్శనమిచ్చింది. కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదు చేశాను. హోటల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇటువంటి హోటల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అంటూ Way2Newsకు తెలిపారు.

Similar News

News February 6, 2025

భీమిలి: ఇన్‌స్టాలో పవన్‌ను తిట్టిన వ్యక్తిపై కేసు

image

తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో Dy CM పవన్ కళ్యాణ్‌‌ను తిడుతూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టిన భీమిలి మండలం జీరుపేట గ్రామానికి చెందిన వ్యక్తిపై కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 2న జీరు వీరుబాబు పెట్టిన పోస్టుపై విజయవాడకు చెందిన TDP బూత్ కన్వీనర్ హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమిలి పోలీసుల సాయంతో గవర్నర్‌పేట పోలీసులు వీరబాబును బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

News February 6, 2025

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: ఈఓ మహేశ్

image

కాళేశ్వరం ఆలయంలో రేపటి నుంచి జరుగనున్న మహాకుంభాభిషేకానికి రానున్న భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈఓ మహేష్ అన్నారు. పీఠాధిపతులు, అర్చకులు, స్వాములు గోపురం పైకి ఎక్కేందుకు వరంజాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ లైట్లు, తాగునీటి వసతి, భక్తులకు సరిపడా లడ్డు, పులిహోర ప్రసాదం ఇతర సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. కుంభాభిషేకం ఉత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు తరలిరావాలని కోరారు.

News February 6, 2025

గచ్చిబౌలిలో కాల్పులు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్ (UPDATE)

image

గచ్చిబౌలి ప్రీజం పబ్ కాల్పుల కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రంజిత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను అరెస్టు చేశారు. అతడికి ఆశ్రయం ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ చోరీ చేసిన డబ్బును రంజిత్ బ్యాంకు ఖాతాలో జమ చేసేవాడని పోలీసులు వెల్లడించారు.

error: Content is protected !!