News February 18, 2025

HYD: ఫేక్ న్యూస్ ప్రధానమైన ముప్పు: సీఎం 

image

తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్‌గా మార్చేందుకు మనమంతా కలిసి పని చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. HYDలోని హెచ్ఐసీసీలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నేటి నుంచి 2 రోజుల పాటు షీల్డ్‌ -2025 కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలకు పరిష్కారాలను కొనుగొనడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సును సీఎం ప్రారంభించారు.

Similar News

News March 24, 2025

ఉప్పల్: పడితే ‘పంచ’ప్రాణాలకు ముప్పే!

image

ట్రిపుల్ రైడింగ్ ప్రాణాలు తీస్తుందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనమే ఉప్పల్లో ఒకే బైకుపై ఐదుగురు ప్రయాణించడం. ఏకంగా బైక్ ట్యాంక్ మీద సైతం కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడా డ్రైవర్. ఇలా డ్రైవ్ చేయడం అంటే మన ప్రాణాలు మనమే తీసుకోవడమని పోలీసులు చెబుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News March 24, 2025

హైటెక్‌సిటీలో కేఫ్ నీలోఫర్ బ్రాంచ్ ప్రారంభం

image

టీ, స్నాక్స్‌కు ప్రసిద్ధి చెందిన కేఫ్ నీలోఫర్ హైటెక్‌సిటీలో నూతన బ్రాంచ్‌ను ఆదివారం మంత్రి శ్రీధర్‌బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. తమ 19వ అవుట్‌లెట్‌ను 40,000sft, 700 మంది కెపాసిటీ, ప్రత్యేకమైన పార్టీ జోన్స్‌తో ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందని MD శశాంక్ తెలిపారు. సంప్రదాయాన్ని ఆధునిక రుచితో మిళితం చేస్తూ ఇక్కడ మరిన్ని ప్రత్యేకతలతో ప్రామాణికమైన హైదరాబాదీ రుచుల వారసత్వాన్ని కొనసాగిస్తామన్నారు.

News March 24, 2025

ఉప్పల్: పడితే ‘పంచ’ప్రాణాలకు ముప్పే!

image

ట్రిపుల్ రైడింగ్ ప్రాణాలు తీస్తుందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనమే ఉప్పల్లో ఒకే బైకుపై ఐదుగురు ప్రయాణించడం. ఏకంగా బైక్ ట్యాంక్ మీద సైతం కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడా డ్రైవర్. ఇలా డ్రైవ్ చేయడం అంటే మన ప్రాణాలు మనమే తీసుకోవడమని పోలీసులు చెబుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

error: Content is protected !!