News January 18, 2025
HYD: ఫైర్ అలర్ట్ క్షణాల్లో తెలిసేలా టెక్నాలజీ: హైడ్రా కమిషనర్

HYD: ప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లో ఆ సమాచారం హైడ్రాకు చేరేలా టెక్నాలజీని తీసుకొని రావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. తెల్లవారుజామున పాత ముంబై హైవే దారిలో అగ్ని ప్రమాదం జరిగిన డ్యూక్స్ అవెన్యూ భవనాన్ని హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా.. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అక్కడి హైడ్రా డీఆర్ఎఫ్, ఫైర్ బృందాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News October 22, 2025
యాదవుల ఖదర్.. హైదరాబాద్ సదర్

సదర్.. సిటీలో జరిగే యూనిక్ ఫెస్టివల్. తమిళనాడు జల్లికట్టు వలే సదర్ ఫేమస్. నిజాం నుంచే ఇది మొదలైంది. నాడు పెద్దలను ఉర్దూలో సదర్ అనేవారు. ఇలా పెద్దల సమ్మేళనం ‘సదర్ సమ్మేళన్’గా మారింది. పాడి రైతులు, యాదవులు ఇష్టంగా పెంచుకున్న పశువులకు పూజలు చేయడం ఆనవాయితీగా వచ్చింది. పెద్ద సదర్‌లో ప్రదర్శించే దున్నరాజులు అత్యంత బలమైనవి. వాటితోనే HYD యువత విన్యాసాలు చేయడం సదర్‌కు మరింత ప్రఖ్యాతిని తెచ్చి పెట్టాయి.
News October 22, 2025
సదర్.. దద్దరిల్లనున్న నారాయణగూడ

సదర్‌కు హైదరాబాద్ సిద్ధమైంది. నారాయణగూడ YMCA చౌరస్తాలో ప్రత్యేకంగా 4 వేదికలు ఏర్పాటు చేశారు. చెప్పల్‌బజార్, కాచిగూడ, ముషీరాబాద్, ఖైరతాబాద్‌తో పాటు నగర నలుమూలల నుంచి యాదవులు వేలాదిగా ఇక్కడికి తరలిరానున్నారు. దేశంలోనే పేరుగాంచిన దున్నరాజులను ప్రదర్శిస్తారు. భారీ లైటింగ్, నృత్యాలు, దున్నరాజులతో యువత విన్యాసాలు సదర్ వైభవాన్ని మరింత పెంచుతాయి. అర్ధరాత్రి వరకు డప్పుల మోతతో నారాయణగూడ దద్దరిల్లనుంది.
News October 22, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ఓపిక లేదని వెళ్లిపోయారు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులకే చిరాకు వచ్చింది. నిన్న పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు టోకెన్లు ఇచ్చారు. బుధవారం తెల్లవారుజాము వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగడంతో టోకెన్లు తీసుకున్న కొందరు అర్ధరాత్రి దాటినా ఇంకా సమయం పడుతుందని తెలిసి, ఇక తమ వల్ల కాదంటూ వెనక్కి వెళ్లిపోయారు. 10 మందికిపైగా అభ్యర్థులు టోకెన్లు తీసుకొని నామినేషన్ వేయనట్లు అధికారులు గుర్తించారు.