News April 29, 2024

HYD: ఫోన్ మాట్లాడుతూ ఇంటిపై నుంచి కింద పడి బాలుడి మృతి

image

తల్లితో ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు బాలుడు ఇంటిపై నుంచి కింద పడి మృతి చెందిన ఘటన అల్వాల్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. హస్మత్‌‌పేటకు చెందిన రవీంద్ర (16) ఇంటి పైకెక్కి తల్లితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి కిందపడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News April 14, 2026

HYDతో అంబేడ్కర్‌కు విడదీయలేని అనుబంధం

image

Dr.BR.అంబేడ్క‌ర్‌కి HYDతో విడదీయలేని అనుబంధం ఉంది. 1932లో తొలిసారి నగరానికి రాగా, 1944లో జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో మాట్లాడి దళితులను చైతన్యపరిచారు. 1953లో నిజాం కాలేజీలో ఆయన ప్రసంగం విని ఆకర్షితుడైన నిజాం ఆయనను HYD స్టేట్‌కు చీఫ్ జస్టిస్‌గా నియమించాలనుకున్నారు. సామాజిక సంస్కరణలు, విద్యావ్యాప్తికి ఆయన పలుమార్లు ఇక్కడికి వచ్చారు. ట్యాంక్ బండ్‌పై ఆయన భారీ విగ్రహం నగరానికి ప్రతీకగా నిలిచింది.

News April 14, 2026

అడ్వకేట్ సుబ్బారావుపై సీపీ సజ్జనార్‌కు మంగ్లీ ఫిర్యాదు

image

తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ అడ్వకేట్ సుబ్బారావుపై కఠినచర్యలు తీసుకోవాలని సింగర్ మంగ్లీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు సీపీ సజ్జనార్‌ను కలిసి ఆమె ఫిర్యాదు అందజేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలను అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.

News April 14, 2026

మామిడి రాకతో బాట‘సింగారం’

image

మామిడి పండ్లు బాటసింగారం బాట పట్టాయి. సోమవారం సుమారు వెయ్యి టన్నుల పండ్లు దిగుమతి అయినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. నగరంలోని మిగతా మార్కెట్లకు మరో 300 టన్నుల మామిడి వచ్చినట్లు అంచనా. ఈ ఏడాది పంట ఆలస్యమైనా ఏప్రిల్ 3వ వారం నుంచే నగర మార్కెట్లకు మామిడి రికార్డు స్థాయిలో దిగుమతి అవుతోంది. హోల్‌సేల్ మార్కెట్‌లోనే సోమవారం మామిడి పండ్ల ధర కిలో రూ.70-120 పలికింది.