News February 4, 2025
HYD: ఫోన్ వాడకం నుంచి పిల్లలని నియంత్రిస్తున్నారా?

రాచకొండ పోలీస్ విభాగం CP సుధీర్ బాబు ఆదేశాలతో, పిల్లల ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పించేందుకు కీలక సూచనలు జారీ చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లల ఇంటర్నెట్ వాడకాన్ని గమనిస్తూ, వారిని కొత్త వ్యక్తులతో మాట్లాడొద్దని పాఠాలు నేర్పాలని సూచించింది. అలాగే తల్లిదండ్రుల నియంత్రణ పద్ధతులతో అనుచిత కంటెంట్ను నిరోధించడం, వాడకపు సమయాన్ని పరిమితం చేయడం అవసరం అని తెలిపింది.
Similar News
News October 21, 2025
‘NITI’ తీరుతో ప్రమాదంలో 113 సిటీలు: పర్యావరణ వేత్తలు

CRZ రిస్ట్రిక్షన్స్ను 500 నుంచి 200 మీటర్లకు కుదించాలన్న నీతి ఆయోగ్ సిఫార్సును తిరస్కరించాలని పర్యావరణవేత్తలు PMకి విన్నవించారు. ‘సముద్ర మట్టం పెరుగుదల వల్ల 2050కు దేశంలోని 113 సిటీలు మునిగిపోతాయని INDIA డవలప్మెంటు రిపోర్టు చెబుతోంది. ప్రస్తుత రూలే కాలం చెల్లగా, ఇంకా కుదించడం మరింత ప్రమాదం’ అని పేర్కొన్నారు. సీ లెవెల్ 91MM పెరిగిందని, ముంపు వంటి ఉపద్రవాలపై నాసా హెచ్చరించిందని గుర్తుచేశారు.
News October 21, 2025
అమలాపురం: PM ఆదర్శ యోజన పథకంపై కలెక్టర్ సమీక్ష

మధ్యలో నిలిచిన పీఎం ఆదర్శ గ్రామ యోజన గ్రామ అభివృద్ధి ప్రణాళికలలో సౌకర్యవంతంగా ఉన్న పనులకు నిధులు ఖర్చు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. అవసరంలేని పనులకు కేటాయించిన నిధులు వేరే పనులకు కేటాయించాలని చెప్పారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్లో పీఎం ఆవాస్ యోజన మొదటి రెండు దశల గ్రామాభివృద్ధి ప్రణాళికలపై DLDO, ఎంపీడీవోలతో సమీక్ష జరిపారు. 40% పైబడి ఎస్సీలు ఉన్న ప్రాంతానికి పథకం ఉపయోగపడుతుందన్నారు.
News October 21, 2025
బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియాలో ఉద్యోగాలు

బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) 3కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, పీజీ(జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్)తో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.295. వెబ్సైట్: https://www.becil.com/