News February 4, 2025

HYD: ఫోన్ వాడకం నుంచి పిల్లలని నియంత్రిస్తున్నారా?

image

రాచకొండ పోలీస్ విభాగం CP సుధీర్ బాబు ఆదేశాలతో, పిల్లల ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పించేందుకు కీలక సూచనలు జారీ చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లల ఇంటర్నెట్ వాడకాన్ని గమనిస్తూ, వారిని కొత్త వ్యక్తులతో మాట్లాడొద్దని పాఠాలు నేర్పాలని సూచించింది. అలాగే తల్లిదండ్రుల నియంత్రణ పద్ధతులతో అనుచిత కంటెంట్‌ను నిరోధించడం, వాడకపు సమయాన్ని పరిమితం చేయడం అవసరం అని తెలిపింది.

Similar News

News February 19, 2025

ఉద్యోగం వదిలేసి వ్యాపారం.. CM చంద్రబాబు ప్రశంసలు

image

ఇంజినీర్ ఉద్యోగం వదిలి మిల్లెట్ వ్యాపారం చేస్తున్న బొర్రా శ్రీనివాస రావును CM చంద్రబాబు ప్రశంసించారు. యువతకు స్ఫూర్తినిస్తున్న ఆయన్ను త్వరలో కలుస్తానన్నారు. ‘మన్యం గ్రెయిన్స్’ పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీని ప్రారంభించి 400-500 మంది రైతులకు సాధికారత కల్పించారని పేర్కొన్నారు. వారి ఆదాయం 20-30% పెరిగేలా చేశారని తెలిపారు. 2018లో అనకాపల్లిలో నెలకొల్పిన ఈ సంస్థ ఆదాయం 2023-24లో ₹1cr+కి చేరింది.

News February 19, 2025

వరంగల్: చిరుదాన్యాలు, ఉత్పత్తుల ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వివిధ రకాల ఉత్పత్తులు, చిరుదాన్యాలు తరలిరాగా.. ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11వేలు పలకగా, దీపిక మిర్చి రూ.16,000, అకిరా బ్యాగడి రూ.11వేల ధర పలికాయి. అలాగే 2043 రకం మిర్చి రూ.14వేలు, ఎల్లో మిర్చికి రూ.17,000, సూక పల్లికాయకి రూ.6820, పచ్చి పల్లికాయకి రూ.5వేల ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News February 19, 2025

ఆన్‌లైన్ డేటింగ్.. రూ.4.3 కోట్లు మోసపోయిన మహిళ

image

ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు చెందిన అన్నెట్ ఫోర్డ్ (57) అనే మహిళ ఆన్‌లైన్ డేటింగ్‌లో రూ.4.3 కోట్లు మోసపోయారు. భర్తకు దూరమైన అన్నెట్ నిజమైన ప్రేమ కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. ‘ప్లెంటీ ఆఫ్ ఫిష్’ అనే డేటింగ్ సైట్‌లో విలియం అనే వ్యక్తితో పరిచయమై రూ.1.6 కోట్లు తీసుకుని మోసం చేశాడు. ఆ తర్వాత FBలో పరిచయమైన నెల్సన్ అనే వ్యక్తి మరో రూ.కోటిన్నర తీసుకున్నాడు. మరో మహిళకు రూ.98.5 లక్షలు ఇచ్చి మోసపోయారు.

error: Content is protected !!