News September 22, 2024
HYD: ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో జూ పార్క్!
HYD శివారు ఫోర్త్ సిటీ ఏరియాలో 200 ఎకరాల్లో జూ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 2 రోజుల క్రితం అటవీశాఖ బృందం గుజరాత్ జామ్‌నగర్ ‘వన్ తారా’ జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి అధ్యయనం చేసింది. ఫోర్త్ సీటీ చుట్టూర దాదాపు 18 వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలో 200 ఎకరాల్లో జూ పార్కుతో పాటు, 1000 ఎకరాల ప్రాంతాన్ని గ్రీన్ బెల్టుగా చూపాలని ప్రభుత్వం భావిస్తోంది.
Similar News
News October 12, 2024
HYD: నేడు జన్వాడకు సింగర్ మంగ్లీ, జానులైరి
శంకర్‌పల్లి మండలంలోని జన్వాడలో ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. వేడుకలకు సింగర్ మంగ్లీ, ఫోక్ డాన్సర్ జానులైరితో పాటు మరికొందరు కళాకారులు సందడి చేయనున్నట్లు బీజేపీ నాయకుడు గౌడిచర్ల వెంకటేశ్ యాదవ్ తెలిపారు. ఏటా బోనాలకు ఆహ్వానించే స్పెషల్ గెస్టులను ఈ సారి దసరాకు ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
News October 12, 2024
HYD: దసరా శుభాకాంక్షలు తెలిపిన మేయర్
దసరా పండుగ సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా పండుగ భారతీయ సంస్కృతిక వారసత్వాన్ని, చెడుపై మంచి గెలుపు, అధర్మంపై ధర్మం విజయాన్ని సూచిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో స్నేహం, ఐక్యత, శాంతి, సత్ప్రవర్తనను ప్రోత్సహించాలని కోరారు. నగర ప్రజలకు సంక్షేమం, సుఖసంతోషాలు సర్వదా ఉండాలని మేయర్ ఆకాంక్షించారు.
News October 12, 2024
HYD: దసరా శుభాకాంక్షలు తెలిపిన ఆమ్రపాలి కాట
GHMC కమిషనర్ ఆమ్రపాలి కాట ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఐకమత్యంతో శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. నగర అభివృద్ధి, పరిశుభ్రత, సుందరీకరణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. దసరా అందరికీ సుఖసంతోషాలను, శాంతిని, సుభిక్షాన్ని అందించాలని కమిషనర్ కోరారు.