News March 2, 2025

HYD: ఫ్యాన్సీ నంబర్లతో రూ.37లక్షల ఆదాయం

image

HYD మణికొండలోని రవాణా శాఖ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్ల వేలం నిర్వహించారు. వేలంలో భారీ మొత్తంలో ఫ్యాన్సీ నంబర్లు ధర పలికాయి. TG07P9999 నంబర్‌ రూ.9.37 లక్షలు పలుకగా.. TG07P0009 రూ.7.50 లక్షలు పలికింది. ఈ ఒక్కరోజే రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.37 లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు.

Similar News

News April 23, 2025

HYDలో మ.12 వరకు ఓటింగ్ పర్సంటేజ్ ఎంతంటే!

image

HYD స్థానిక సంస్థల ఎలక్షన్ ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 77.68% పోలింగ్ జరిగిందని అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్, MIM, BJP సభ్యులు తమ ఓటును నమోదు చేసుకుంటున్నారు. KTR పిలుపు మేరకు గులాబి దళం నుంచి పోలింగ్‌‌లో ఎవరూ పాల్గొనలేదు. ఇప్పటివరకు దూరంగానే ఉంది.

News April 23, 2025

HYD: యూనిట్లకు బిల్లు ఎలా నిర్ధారిస్తారంటే!

image

గ్రేటర్ HYDలో వేసవి వేళ కొందరికి కరెంట్ బిల్లులు వేలల్లో వస్తుండగా షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల వివరాలను హబ్సిగూడ అధికారులు తెలిపారు. జీరో నుంచి 50 యూనిట్లకు రూ.1.95, 50 నుంచి 100 యూనిట్లకు రూ.3.10, 101-200 యూనిట్లకు రూ.4.80, 201-300 యూనిట్లకు రూ.7.70 చొప్పున ఒక్కో యూనిట్‌పై ఇలా విద్యుత్ ఛార్జీ ఉంటుందని, లిమిట్ దాటితే యూనిట్ ఛార్జీ మారుతుందని తెలిపారు.

News April 23, 2025

HYD: గురుకుల విద్యార్థికి స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్

image

మైనార్టీ గురుకులానికి చెందిన ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థి ఎండీ. ఫర్హాన్‌కు CEC విభాగంలో స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్ ల‌భించింది. TMRJC ఖైర‌తాబాద్‌కు చెందిన ఫర్హాన్‌కు 500 మార్కుల‌కు గాను 495 మార్కులు వ‌చ్చాయి. ప్రణాళిక ప్రకారం చదవడం, అధ్యాపకుల ప్రోత్సాహం కారణంగా ఈ ర్యాంక్ వచ్చినట్టు ఫర్హాన్ తెలిపారు. దీంతో విద్యార్థికి కళాశాల అధ్యాపకులు, తోటి మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!