News October 7, 2024
HYD: ఫ్యూచర్ సిటీ వైపు పరుగులు.. జర జాగ్రత్త..!

రాష్ట్ర ప్రభుత్వం RR జిల్లా మహేశ్వరం పరిధి కందుకూరు, ముచ్చర్ల, మీర్ఖాన్పేట్, బేగరికంచె ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రియల్ ఎస్టేట్ సంస్థలు ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి, ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు పరుగులు పెడుతున్నాయి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పేరుతో కొందరు కేటుగాళ్లు నకిలీ పత్రాలతో భూ అమ్మకాలకు పాల్పడుతున్నారు. జర జాగ్రత్త!
Similar News
News October 16, 2025
HYD: ఆన్లైన్లో అమ్మాయి.. మోసపోయిన అబ్బాయి!

ఆన్లైన్ డేటింగ్, ఫ్రెండ్షిప్ స్కామ్లో పడ్డ వ్యక్తి రూ.6,49,840 పోగొట్టుకున్నాడు. మలక్పేట్కు చెందిన వ్యక్తి (32)కి డేటింగ్ సైట్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైంది. పెళ్లి కుదురుస్తామని మాట్లాడి కొంత డబ్బు తీసుకుంది. అనంతరం ఓ ఫ్రెండ్షిప్ గ్రూప్లో యాడ్ చేసింది. అందులో ఉన్నవారి సూచనల మేరకు బాధితుడు విడతల వారీగా రూ.6,49,840 చెల్లించాడు. తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
News October 16, 2025
జూబ్లీహిల్స్: ఉప ఎన్నికలో కొత్తగా 16 నామినేషన్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం కొత్తగా 16 మంది క్యాండిడేట్లు 21 నామినేషన్లు వేసినట్లు రిటర్నింగ్ అధికారి సాయిరాం వెల్లడించారు. నాలుగు రోజుల్లో 46 మంది క్యాండిడేట్లు దరఖాస్తు చేయగా.. మొత్తం 56 నామినేషన్లు దాఖలు అయ్యాయని పేర్కొన్నారు.
News October 16, 2025
జూబ్లీహిల్స్లో బై‘పోల్’ పరేషాన్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. ఇక్కడ ఓటు వేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇది ఈసారేకాదు నియోజకవర్గం కొత్తగా ఏర్పడినప్పటి నుంచీ జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో 56 శాతం, 2018లో 47.58 శాతం, 2023లో 45.59 శాతం పోలింగ్ జరిగింది. అంటే పదేళ్లలో దాదాపు 10 శాతం పడిపోయింది. మరి ఈసారి ఎంత శాతం నమోదవుతుందో చూడాలి.