News February 13, 2025
HYD: ఫ్రీ కరెంట్.. పైగా ఖాతాలోకి నగదు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ విద్యుత్శాఖ ఏఈ మురళీకృష్ణ సూచించారు. ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుంటే ఉపయోగాలు సూచించారు. ప్యానెల్స్ను అనుసంధానించి ఇంట్లో ఏర్పాటు చేసిన మీటర్ ద్వారా వినియోగించగా మిగిలిన విద్యుత్ డిస్కంలకు సరఫరా అవుతుంది. డిస్కంలతో ఒప్పందం ప్రకారం 6 నెలలకు ఒకసారి లెక్కేసి ఖాతాలో నగదు జమ చేస్తారు. #SHARE IT
Similar News
News November 15, 2025
నేడు జగిత్యాలతో లక్ష దీపోత్సవం

జగిత్యాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో జరుగనున్న లక్ష దీపోత్సవం ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని రాష్ట్ర సంపర్క సభ్యుడు వేముల సంతోష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే లక్ష దీపోత్సవాన్ని ఈసారీ యథావిధిగా గీత విద్యాలయం గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
News November 15, 2025
కృష్ణా : RTCలో ఐటీఐ అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

APSRTCలో ITI అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ITI ఉత్తీర్ణులైన వారు అప్రెంటీస్ షిప్ కొరకు ఈ నెల 30వ తేదీలోపు www.apprenticeshipindia.gov.in ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని విజయవాడ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్ తెలిపారు. ITI మార్క్స్, సీనియారిటీ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.
News November 15, 2025
400 MOUలు.. రూ.11,91,972 కోట్ల పెట్టుబడులు

విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. రూ.11,91,972 కోట్ల పెట్టుబడులతో 400 ఎంఓయూలు జరిగాయి. వీటి ద్వారా 13,32,445 ఉద్యోగాలు రానున్నాయని అధికార యంత్రాంగం తెలిపింది. ఏపీ సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐఅండ్ఐ, పరిశ్రమలు-వాణిజ్యం, ఐటీ, మున్సిపల్ శాఖల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.


