News January 28, 2025
HYD: బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: గద్దర్ గళం

తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాయుద్ధ నౌక, దివంగత నేత గద్దర్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గద్దర్ గళం అసోసియేషన్ ఫౌండర్ ఛైర్మన్ కొల్లూరు సత్తయ్య తెలిపారు. మంగళవారం HYD బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ పసునూరి రవీందర్, పాశం యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 26, 2026
HYD: విద్యార్థులకు టెలి మనస్ సేవలు

TGBIE ఆధ్వర్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. పరీక్షల్లో ఒత్తిడి, భయం, నిరుత్సాహాన్ని ఎదుర్కొనే విద్యార్థులు మౌనం వహించకుండా తమ సమస్యలను పంచుకోవాలని సూచించారు. అవసరమైనప్పుడు నిపుణుల సహాయం పొందడం తప్పు కాదని పేర్కొన్నారు. మానసిక సహాయం కోసం టెలీ మానస్ హెల్ప్‌లైన్ 14416లో సంప్రదించాలని BIE ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ వెల్లడించారు.
News February 25, 2026
సైబరాబాద్ కమిషనరేట్‌కు కొత్తగా 2 పోలీస్ కేనైన్‌లు

తెలంగాణ సీఐడీ నుంచి రెండు పోలీస్ కేనైన్‌లు సైబరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ అయ్యాయి. దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న జాగిలాల సంఖ్య18కు చేరింది. పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల గుర్తింపు, ట్రాకింగ్ వంటి కీలక విధుల్లో ఇవి సేవలందించనున్నాయి. సీఐడీ నుంచి వచ్చిన ‘రానా’ (బెల్జియన్ మాలినోయిస్), ‘రాడో’ (లాబ్రడార్) నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.
News February 25, 2026
RR: ఎగ్జామ్‌కు READY అయ్యారా?

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డిలో 180 పరీక్షా కేంద్రాలు ఉండగా.. 84,301 మంది 1st ఇయర్ విద్యార్థులు, 70,171 మంది 2nd ఇయర్ విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 1,54,472 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా అలర్ట్ ఇచ్చే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది. హాల్ టికెట్, పెన్నులు మర్చిపోకండి. ప్రశాంతంగా ఉండండి.


