News January 28, 2025

HYD: బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: గద్దర్ గళం

image

తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాయుద్ధ నౌక, దివంగత నేత గద్దర్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గద్దర్ గళం అసోసియేషన్ ఫౌండర్ ఛైర్మన్ కొల్లూరు సత్తయ్య తెలిపారు. మంగళవారం HYD బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ పసునూరి రవీందర్, పాశం యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 27, 2025

VZM: డిసెంబర్ 5న డ్రమ్స్ శివమణికి సత్కారం

image

ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో డిసెంబరు 5న విజయనగరంలో ఘంటసాల జయంత్యుత్సవాలు జరుగుతాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీత డ్రమ్స్ శివమణిని ఆరోజు సత్కరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.భీష్మారావు తెలిపారు. ముందుగా గుమ్చీ కూడలిలోని ఘంటసాల విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం ఆనందగజపతి ఆడిటోరియంలో 12 గంటల స్వరాభిషేకం, సాయంత్రం శివమణి సంగీత కార్యక్రమం చేపట్టనున్నారు.

News November 27, 2025

WPL మెగా వేలంలో అమ్ముడుపోని హీలీ.. దీప్తికి రూ.3.2 కోట్లు

image

WPL మెగా వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీకి షాక్ తగిలింది. వేలంలో ఆమెను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో Unsoldగా మిగిలారు. భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తిని రూ.3.2 కోట్లకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సౌతాఫ్రికా కెప్టెన్ లారాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.10కోట్లకు దక్కించుకుంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది.

News November 27, 2025

MBNR: ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ డి.జానకి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయిని దేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆమె వివరించారు. అనంతరం ఎస్పీ జానకి అల్లిపూర్ గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.