News January 28, 2025

HYD: బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: గద్దర్ గళం

image

తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాయుద్ధ నౌక, దివంగత నేత గద్దర్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గద్దర్ గళం అసోసియేషన్ ఫౌండర్ ఛైర్మన్ కొల్లూరు సత్తయ్య తెలిపారు. మంగళవారం HYD బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ పసునూరి రవీందర్, పాశం యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 19, 2025

ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు నిర్మల్ కలెక్టర్ స్వాగతం

image

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల సేకరణపై బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణా ఆదిత్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. ఆమెతో పాటు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఉన్నారు.

News February 19, 2025

శాంతిభద్రతల సమస్య లేకుండా చూస్తాం: నిర్మల్ ఎస్పీ

image

శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల అన్నారు. బుధవారం బైంసాలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. భైంసా సబ్ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గ్రీవెన్స్‌డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News February 19, 2025

CHAMPIONS TROPHY: 12 వేల మందితో భారీ భద్రత!

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పీసీబీ భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఇందులో 18 మంది సీనియర్ ఆఫీసర్లు, 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్‌స్పెక్టర్లు, 1,200 మంది అప్పర్ సబార్డినేట్‌లు, 10,556 మంది కానిస్టేబుళ్లను నియమించింది. అదనంగా 200 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. అలాగే ఆటగాళ్లు, ప్రముఖుల కోసం 9 స్పెషల్ చార్టర్ ఫ్లైట్లను కూడా అందుబాటులో ఉంచింది. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ మధ్య ఇవి ప్రయాణిస్తాయి.

error: Content is protected !!