News November 11, 2024
HYD: బండి సంజయ్ దళిత వ్యతిరేకి: డా. లింగస్వామి

తెలంగాణ ఉన్నత విద్యా కమిషన్ రద్దు చేయాలని, ఛైర్మన్గా నియమించబడ్డ ఆకునూరి మురళిని తొలగించాలనడం బండి సంజయ్కి దళితుల మీదున్న వ్యతిరేకతకు నిదర్శనమని అంసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓయూ జేఏసీ అధ్యక్షుడు డా. మంచాల లింగస్వామి ఆరోపించారు. బండి సంజయ్, BJP దళితులకు వ్యతిరేకమని, దళిత ఐఏఎస్ అధికారిని తొలగించాలన్న బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి అనర్హుడని, ఆయనను బర్తరఫ్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Similar News
News November 20, 2025
షుగర్ కేసులు.. దేశంలోనే హైదరాబాద్ నం.4

దేశంలో డయాబెటిస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు అధికంగా ఉన్న నగరాల్లో HYD 4వ స్థానంలో నిలిచింది. జీవనశైలి, ఒత్తిడి, వ్యాయామం తగ్గడం, జంక్ఫుడ్, అధికంగా కార్బ్స్ తీసుకోవడం దీనికి ప్రధాన కారణాలని వైద్యులు తెలిపారు. గొంతు తడారడం, తరచూ మూత్ర విసర్జన, శరీర బరువు తగ్గటం, అలసటగా ఉంటే అశ్రద్ధ చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
News November 20, 2025
HYD: ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్న సీసీఎస్ పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్ ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. వారం రోజులు రవిని కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా 5 రోజులకు అనుమతి ఇచ్చింది. రవిని నేడు చంచల్గూడ జైలు నుంచి సీసీఎస్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.
News November 20, 2025
HYD: ట్రేడ్ లైసెన్స్ గడువు పొడిగింపు

ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, కొత్త దరఖాస్తుల గడువును GHMC పొడిగించింది. డిసెంబర్ 1 వరకు ఉన్న గడువును MCC కారణంగా డిసెంబర్ 20వ తేదీ వరకు పొడిగిస్తూ కమిషనర్ బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీంతో వ్యాపారులు ఎటువంటి పెనాల్టీ లేకుండా డిసెంబర్ 20 వరకు తమ దరఖాస్తులను ఆన్లైన్, మీ-సేవ కేంద్రాల ద్వారా సమర్పించవచ్చు. లైసెన్స్ లేని వ్యాపారాలపై 100% జరిమానాతోపాటు ప్రతినెల 10% అపరాధ రుసుము వసూలు చేస్తారు.


