News April 3, 2024
HYD: బంపర్ OFFER మీ కోసమే.. త్వరపడండి!

HYDతో పాటు RR, MDCL,VKB జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ఏప్రిల్ 30వ తేదీలోపు చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందవచ్చని తెలియజేసింది. కావున ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని, ఈ లింక్ https://cdma.cgg.gov.in/cdma_arbs/CDMA_PG/PTMenu ద్వారా చెల్లించవచ్చని తెలిపింది. SHARE IT
Similar News
News February 26, 2026
HYD: ఇంటర్ విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్

TGBIE ప్రత్యేకంగా స్టూడెంట్స్ & పేరెంట్స్ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షలు, హాల్ టికెట్లు, ఫలితాలు తదితర అంశాలపై మార్గదర్శనం, సందేహాల నివృత్తికి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ తెలిపారు. హెల్ప్‌లైన్ నం. 040-24655027, IVR. No. 9240205555కు కాల్ చేసి విద్యార్థులు తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. అవసరమైన సహాయం కోసం వెంటనే సంప్రదించాలని సూచించారు.
News February 26, 2026
HYD: ఫోన్ రిపేర్, ఐటీఐ, ల్యాండ్ సర్వేలో ఫ్రీ కోర్సు

ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీ వర్గాలకు చెందిన 18- 35 ఏళ్ల యువత నుంచి ఉచిత శిక్షణ కోర్సులకు FEB 25- మార్చి 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఇలియాస్ అహ్మద్ తెలిపారు. ల్యాండ్ సర్వేయర్, ఎంఈపీ టెక్నీషియన్ (ఇంటర్/ఐటీఐ/డిప్లొమా), స్మార్ట్‌ఫోన్ రిపేర్ (టెన్త్) కోర్సులకు 3 నెలల శిక్షణ ఇస్తారు. ఆధార్, విద్యార్హత సర్టిఫికెట్‌లు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం
News February 26, 2026
హైదరాబాద్‌లో ప్రత్యక్ష నరకం

HYDలో దోమల బెడద కునుకు లేకుండా చేస్తోంది. పొగబెట్టినా పోతలే, నిద్రపోనిస్తలే.. ఆరోగ్యాలు పాడవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి, నాచారం, ఎల్బీనగర్, ఉప్పల్, కుంట్లూర్, పెద్దఅంబర్‌పేట్, మంచాల, రాజేంద్రనగర్, శంషాబాద్, షాద్‌నగర్లో ఎక్కువగా ఉంది. రాత్రంతా నరకం చూపిస్తున్నాయని వాపోతున్నారు. మునుపెన్నడూ లేనంతగా వ్యాప్తిచెందినా యంత్రాంగానికి చీమకుట్టినట్లు లేదా అని ప్రశ్నిస్తున్నారు.


