News June 11, 2024

HYD: బక్రీద్ పండుగ.. వ్యర్థాలను రోడ్లపై వేయకండి..!

image

బక్రీద్ పర్వదినాన వెలువడే వ్యర్థాలను రోడ్లపై వేయకూడదని GHMC అధికారులు సూచించారు. ఈ మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మెయింటైనింగ్ కన్వీనర్ మహమ్మద్ అలీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా మారుస్తూనే , పండగలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించుకోవాలని కోరారు. ఉప్పల్, నాంపల్లి, మలక్‌పేట్, నాచారం ప్రాంతాల్లో ప్రత్యేక NGOS స్వచ్ఛతకు కృషి చేస్తున్నాయన్నారు.

Similar News

News November 20, 2025

HYD: అర్ధరాత్రి రోడ్లపై తిరిగిన ముగ్గురి యువకుల అరెస్ట్

image

అర్ధరాత్రి రోడ్లపై కారణం లేకుండా తిరుగుతున్న ముగ్గురు యువకులను టోలీచౌకీ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులపై పెట్టీ కేసులు నమోదు చేసి, వారిని 3 – 7 రోజుల రిమాండు విధించారు. ఇకనుంచి ఎలాంటి కారణం లేకుండా అర్ధరాత్రి రోడ్లపై తిరగకూడదని ప్రజలను హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు హెచ్చరించారు.

News November 20, 2025

రాజకీయ లబ్ధికోసం KTRపై అక్రమ కేసులు: హరీశ్

image

HYD బ్రాండ్ ఇమోజీని పెంచిన KTRపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న KTRపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికమని స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధిపొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

News November 20, 2025

HYD: కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు: చనగాని

image

ఈ కార్ రేసు అవినీతిలో మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఛార్జ్ షీట్ కోసం గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు, సీఎం అంటే గౌరవంలేకుండా పొగరుగా వ్యవహిరించడం ప్రజాస్వామ్యానికి అవమానకరం అన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా నిధుల దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారని ఆరోపించారు.