News March 19, 2025
HYD: బడ్జెట్‌లో ట్యాంక్‌బండ్‌ను కాపాడండి!

రాష్ట్ర బడ్జెట్‌లో హుస్సేన్‌సాగర్‌కు న్యాయం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. దుర్గంధభరితమైన నీటితో టూరిస్టులు ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది. పొల్యూషన్ పెరిగి నీరు గ్రీన్ కలర్‌లోకి మారుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ సుందరీకరణ బాగున్నా మురికి కూపంపై ఎవరూ దృష్టి పెట్టడంలేదు. ఇకనైనా నీటి ప్రక్షాళనకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బడ్జెట్‌లో HYDకు ఇంకెం కావాలి..మీ కామెంట్?
Similar News
News November 27, 2025
HYD: FREEగా వెళ్లొద్దాం రండి!

HYD పరిధి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం జరుగుతోంది. నవంబర్ 30 వరకు ఉ.10 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ ఉంటుందని HYD టూరిజం తెలిపింది. ఉచితంగా రాష్ట్రపతి నిలయం, వివిధ రకాల, కళలు వీక్షించే అవకాశం ఉంది. సా.7:00 వరకు లాస్ట్ ఎంట్రీగా పేర్కొన్నారు. QR కోడ్ స్కాన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి.
News November 27, 2025
అయోధ్య ఆలయంలో హైదరాబాద్ కిటికీలు

కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని) సంస్థ అయోధ్యలోని రామాలయం కోసం కిటికీలను తయారుచేసింది. టైటానియం ఆర్కిటెక్చరల్ విండోలను తయారుచేసి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి అందజేసినట్లు మిథాని అధికారులు తెలిపారు. 31 కీటికీలను తయారు చేసి ఆలయానికి ఇచ్చామని వివరించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రదక్షణ కారిడార్ కోసం ఇంజినీరింగ్ విభాగం వీటిని తయారుచేసింది.
News November 26, 2025
HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.


