News March 19, 2025

HYD: బడ్జెట్‌లో ట్యాంక్‌బండ్‌ను కాపాడండి!

image

రాష్ట్ర బడ్జెట్‌లో హుస్సేన్‌సాగర్‌కు న్యాయం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. దుర్గంధభరితమైన నీటితో టూరిస్టులు ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది. పొల్యూషన్‌ పెరిగి నీరు గ్రీన్ కలర్‌‌లోకి మారుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ సుందరీకరణ బాగున్నా మురికి కూపంపై ఎవరూ దృష్టి పెట్టడంలేదు. ఇకనైనా నీటి ప్రక్షాళనకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బడ్జెట్‌లో HYDకు ఇంకెం కావాలి..మీ కామెంట్?

Similar News

News September 18, 2025

ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలి: కలెక్టర్

image

కెజిబివి, ఇంటర్మీడియట్ కళాశాలలో ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయా పాఠశాలలు, ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కేజీబివిలు, ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలు, అప్లిఏషన్, ఫలితాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. గడిచిన 3 సంవత్సరాలలో ప్రవేశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు.

News September 18, 2025

ఆరోగ్యమే మహాభాగ్యం: ఆదిలాబాద్ ఎంపీ

image

ఆదిలాబాద్‌లో నిర్వహించిన స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరంలో ఎంపీ గోడం నగేశ్ పాల్గొన్నారు. బుధవారం హమాలీవాడ అర్బన్ హెల్త్ సెంటర్‌లో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాతో కలిసి పేదలకు పథకం ద్వారా అందించే ఫుడ్ కిట్స్‌ను ఎంపీ పంపిణీ చేశారు. శిక్షణ కలెక్టర్ సలోని, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు.

News September 18, 2025

ఈ సర్కార్ కార్మికులది.. సమస్యలు పరిష్కరిస్తా: CM రేవంత్

image

TG: హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని భాషల సినిమాల షూటింగ్‌లు ఇక్కడ జరిగేలా సహకరించాలని సూచించారు. సమ్మె చేస్తే ఇరువర్గాలకూ నష్టం జరుగుతుందన్నారు. సినీ కార్మికుల తరఫున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని వెల్లడించారు. ఈ సర్కార్ కార్మికులదని, సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.