News January 30, 2025
HYD: బడ్జెట్ సమావేశాలు అడ్డుకోవడం సరికాదు: మంత్రి పొన్నం

GHMC బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే వాటిని అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. GHMC బడ్జెట్ హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన అంశమని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం శ్రద్ధతో పని చేస్తోందన్నారు. అవిశ్వాసం పెట్టుకునే హక్కు అందరికీ ఉందని, అవిశ్వాసం ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు.
Similar News
News November 19, 2025
HYD: ప్లాస్టిక్ బాటిల్స్, పాత్రలు వాడుతున్నారా?

ప్రతిచోట ప్లాస్టిక్ కామన్ అయిపోయింది. మైక్రోప్లాస్టిక్స్తో మానవ శరీరంలో క్యాన్సర్స్, లీకీగట్, ఆహారాన్ని జీర్ణాశయం శోషించుకోలేకపోవడం వంటివి సైంటిస్టులు గుర్తించారు. HYDలో ప్రతి ఒక్కరి కడుపులోకి 0.8% మైక్రోప్లాస్టిక్ వెళ్తున్నట్లు ‘హెల్త్ మైక్రో ప్లాస్టిక్ కవరేజ్’ వెల్లడించింది. ప్లాస్టిక్కు వేడి తగిలితే నానోపార్టికల్స్ రిలీజ్ అవుతాయని, పింగాణీ, స్టీల్, ఇత్తడి, మట్టిపాత్రలు వాడాలని సూచించింది.
News November 19, 2025
HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
News November 19, 2025
HYD: ‘డ్రగ్స్ వద్దు.. కెరీర్ ముద్దు’

డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి జోలికి వెళ్తే జీవితం అగమ్య గోచరంగా మారుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గాంధీ మెడికల్ కాలేజీలో నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవాల సందర్భంగా మెడికల్ విద్యార్థులకు డ్రగ్స్పై అవేర్నెస్ కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, ఐఏఎస్ అధికారి అనిత రామచంద్రన్, టీ న్యాబ్ అధికారులు పాల్గొన్నారు.


