News January 30, 2025

HYD: బడ్జెట్ సమావేశాలు అడ్డుకోవడం సరికాదు: మంత్రి పొన్నం 

image

GHMC బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే వాటిని అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. GHMC బడ్జెట్ హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన అంశమని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం శ్రద్ధతో పని చేస్తోందన్నారు. అవిశ్వాసం పెట్టుకునే హక్కు అందరికీ ఉందని, అవిశ్వాసం ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు.

Similar News

News February 18, 2025

విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో జూనియర్, సీనియర్ డిప్లొమా అభ్యర్థులు తమ పరీక్షా ఫీజును వచ్చే నెల 5వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. రూ.300 అపరాధ రుసుముతో పదవ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు. ఈ పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News February 18, 2025

HYD: శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డ విదేశీ కరెన్సీ

image

శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్‌ఎఫ్‌ అధికారులకు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతణ్ణి క్షుణ్ణంగా తనిఖీ చేయగా 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసరు. ప్రయాణికుడిని అమీర్‌ అహ్మద్‌గా గుర్తించి అదుపులోకి తీసుకొని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

News February 18, 2025

BREAKING: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో తప్పిన ప్రమాదం

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లూ డార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య ఏర్పడింది. దీంతో రన్ వేపై అత్యవసర ల్యాండింగ్‌కు పైలెట్ అనుమతి కోరారు. అనంతరం కార్గో ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు.

error: Content is protected !!