News February 8, 2025
HYD: బతికున్నప్పుడు దరఖాస్తు.. చనిపోయాక పెన్షన్

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలో 2022 పెన్షన్ కోసం పలువురు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 191 మంది పెన్షన్ మంజూరైనట్లు సర్కిల్ అధికారులు జాబితా విడుదల చేశారు. ఆ జాబితాలో 32 మంది మృతుల పేర్లు ఉన్నాయని కాప్రా సర్కిల్ అధికార వర్గాల సమాచారం. బతికి ఉన్నప్పుడు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చనిపోయాక పేరు మంజూరు కావడం కాప్రా మున్సిపల్ కార్యాలయంలో చర్చనియాంశంగా మారింది.
Similar News
News November 28, 2025
ప్రకాశం: పొగ మంచు కురుస్తోంది.. జాగ్రత్త.!

ప్రస్తుతం జాతీయ రహదారుల్లో అధికంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని, వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వాహనదారులు, డ్రైవర్లకు శుక్రవారం పలు సూచనలు జారీ చేసింది. హైవేల్లో రాకపోకలు సాగించే వాహనాలకు కాస్త గ్యాప్తో ప్రయాణించాలన్నారు. అలాగే ట్రాఫిక్ జామ్ సమయాలలో కూడా వాహనాల రద్దీ నేపథ్యంలో జాగ్రత్త వహించాలన్నారు.
News November 28, 2025
స్వామి సన్నిధానాన్ని చేరేందుకు.. కష్టాన్ని కూడా మర్చిపోతారు

శబరిమల యాత్రలో నీలిమల కొండను కఠినమైన సవాలుగా భావిస్తారు. కానీ, అయ్యప్ప నామ స్మరణతో సులభంగా ఈ కొండను ఎక్కేస్తారు. అయితే ఇక్కడి నుంచే భక్తులకు సన్నిధానానికి త్వరగా చేరాలనే ఉత్కంఠ, స్వామివారి దివ్య మంగళ రూపాన్ని చూడాలనే ఆత్రుత మొదలవుతాయట. స్వామి దర్శనం పట్ల ఉండే ఈ అపారమైన భక్తి భావమే ఈ కఠినమైన దారిని సులభంగా దాటేలా చేస్తుందని నమ్మకం. <<-se>>#AyyappaMala<<>>
News November 28, 2025
సిరిసిల్ల: ఉపాధ్యాయురాలిగా మారిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్లలో జరిగిన ఇన్స్పైర్, విద్యా వైజ్ఞానిక సదస్సులో ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్థులతో మమేకమయ్యారు. సౌర విద్యుత్, పవన విద్యుత్, థర్మో డైనమిక్స్, కిరణజన్య సంయోగ క్రియ తదితర అంశాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టారు. సైన్స్ పట్ల విద్యార్థులకు అవగాహన వచ్చేందుకు ఎగ్జిబిషన్లు దోహదపడతాయన్నారు.


