News October 7, 2024
HYD: బతుకమ్మ సంబరాల్లో ముస్లిం నాయకులు

HYD చందానగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా ఆదివారం రాత్రి శేరిలింగంపల్లిలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పలువురు ముస్లిం నాయకులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. TPCC మైనార్టీ సెల్ వైస్ ఛైర్మన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. అన్ని మతాల పండుగలను గౌరవించడం భారత పౌరుడిగా మన బాధ్యత అని అన్నారు.
Similar News
News December 8, 2025
HYDలో అక్కడ ఒక్క రూపాయికే టిఫిన్

HYDలోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో భోజనం కోసం బిక్కు బిక్కుమంటూ తిరిగే వాళ్లెందరో. అలాంటి వారిని చూసి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ‘కరుణ కిచెన్’ జార్జ్ రాకేశ్బాబు రూపాయికే టిఫిన్ పెడుతున్నట్లు తెలిపారు. రోజూ మెనూ ఛేంజ్ చేస్తూ దాదాపు 300 మంది కడుపు నింపుతున్నారు. ఉ.7 గం.- 9 గం. వరకు 2 గంటలు కొనసాగుతోంది. ‘డబ్బు కోసం కాదు.. నలుగురి కడుపు నింపేందుకు. ఇందులోనే నా సంతోషం ఉంది’ అని తెలిపారు.
News December 8, 2025
ప్రపంచాన్ని ఏకం చేసేలా HYDలో సమ్మిట్

HYD శివారు మీర్ఖాన్పేట్ గ్లోబల్ సమ్మిట్కు వేదికైంది. 44కిపైగా దేశాలు, 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, గ్లోబల్ కంపెనీలు పాల్గొననున్న ఈ సమ్మిట్ మ.1:30కు ప్రారంభం కానుంది. నోబెల్ గ్రహీతలు అభిజిత్, కైలాష్ సత్యర్థి ప్రధాన వక్తలు. వీరిలో 46 మంది అమెరికా ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, అమెజాన్, ఐకియా తదితర ప్రతినిధులు ఉన్నారు. అంతేకాదు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ కంపెనీలు, ఇతర దేశాల రాయబారులు రానున్నారు.
News December 8, 2025
ఇక తెలంగాణ ‘ఫ్యూచర్’ మన HYD

నేటి నుంచే కందుకూరులో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇది ప్రపంచ ఆర్థిక సదస్సు ‘దావోస్’గా కార్యరూపం దాల్చింది. ఈ ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులను ఆకర్షించి, యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆహ్వానించింది. ఇప్పటికే బ్లాక్ క్యాట్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ అక్కడ పహారా కాస్తున్నాయి. ఈ సమ్మిట్తో ‘నిన్నటి వరకు ఒక లెక్క నేటి నుంచి మరో లెక్క’ అని సీఎం ధీమా వ్యక్తంచేశారు.


