News April 29, 2024

HYD: ‘బయటకు రావొద్దు’

image

HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలపై భానుడు సెగలు కక్కుతున్నాడు. ఆదివారం ఘట్‌కేసర్‌ మండలం ఘన్‌పూర్‌లో అత్యధికంగా 43.8 డిగ్రీలు, మొయినాబాద్‌ మండలం మృగవని పార్కు సమీపంలో 43.6 డిగ్రీలు, బంట్వారం మండలం నాగారంలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రేపు, ఎల్లుండి జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఎండల దృష్ట్యా ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

Similar News

News November 21, 2025

HYD: నిఖత్ జరీన్‌కు మంత్రి శుభాకాంక్షలు

image

గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడంపై HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తెలుగు జాతి గౌరవాన్ని ఖండాంతరాలు దాటించిందని మంత్రి అభినందించారు. నిఖత్ జరీన్ భవిష్యత్‌లో మరెన్నో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి దేశ, రాష్ట్రాల ప్రతిష్ఠను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

News November 21, 2025

సికింద్రాబాద్ మహంకాళమ్మ ఆలయంలో రుద్రహోమం

image

కార్తీక మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీమహాకాళేశ్వర స్వామి, శ్రీవీరభద్ర స్వామికి 108 లీటర్ల పాలు, పండ్లతో అభిషేకం చేశారు. రుద్రహోమం నిర్వహించగా ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. కార్తీక మాసం ముగింపు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.

News November 21, 2025

HYD: ఇది రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయ దాడి: దాసోజు

image

ఫార్ములా-ఈ కేసు పూర్తిగా కక్ష సాధింపు రాజకీయ దాడిగా సీఎం రేవంత్ రెడ్డి రూపొందించారని BRS MLC శ్రవణ్ దాసోజు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇది KTR వ్యక్తిత్వ హననం చేయాలనే ఉద్దేశంతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని మండిపడ్డారు. ఈకేసు చట్టపరమైన స్థిరత్వం, ఆధారాలు, సాక్ష్యాలు లేని పక్కా కుట్రగా అభివర్ణించారు. ఇది చట్టం, న్యాయం కాదు రేవంత్ రెడ్డి రాసిన ప్రతీకార స్క్రిప్ట్ అని అన్నారు.