News March 17, 2025
HYD: బరువు పెరగడంతో డయాబెటిస్..?

డయాబెటిస్ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని డాక్టర్ వసంత్ కుమార్ అన్నారు. డే సొసైటీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చాలామంది చిన్నపిల్లలు ఇన్సులిన్ తీసుకుని స్థాయికి రావడం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. 30ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు షుగర్ టెస్ట్ చేయించుకోవాలని, ఆహార అలవాట్లు, బరువు పెరగడంతో డయాబెటిస్ రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
Similar News
News March 17, 2025
పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షా తేదీ ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షా తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ వన్ టైం ఛాన్స్ బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈనెల 18వ తేదీ (రేపు) నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.
News March 17, 2025
HYDలో విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

హైదరాబాద్ జిల్లాలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టి లోపం ఉన్నవారికి కంటి అద్దాలు అందిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మొత్తం 71,309 మంది విద్యార్థుల్లో 8,849 మందికి కంటి సమస్యలు గుర్తించారు. 7,524 మందికి పునఃపరీక్షలు నిర్వహించి నాణ్యమైన కంటి అద్దాలు పంపిణీ చేశారు. విద్యార్థులు మొబైల్, టీవీ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.
News March 17, 2025
జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్‌కు బెయిల్

జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పు ఇవాళ్టికి వాయిదా వేసింది. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు రేవతి, తన్వీ యాదవ్‌లకు బెయిల్ మంజూరు చేసింది. వారిపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.