News May 4, 2024

HYD: బర్త్‌డే కేక్‌ కోసం వెళ్లి బాలుడి మృతి

image

బర్త్‌డే సందర్భంగా కేక్ తెచ్చుకోవడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన HYD షాద్‌నగర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. రతన్‌ కాలనీకి చెందిన బిజ్వి సందీప్‌ (16) బర్త్‌డే సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్‌ కట్‌ చేయాలని గురువారం రాత్రి బయటికి వెళ్లాడు. కేశంపేట బైపాస్‌ చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా జడ్చర్ల వైపు వెళ్తున్న వాహనం అతడిని ఢీకొంది. దీంతో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News November 5, 2024

HYD: ఆటో డ్రైవర్ల మహా ధర్నాకు కేటీఆర్

image

నేడు ఆటో డ్రైవర్లు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నాను నిర్వహించనున్నారు. కాగా ఈ మహా ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. అయితే ఈరోజు నిర్వహించే మహా ధర్నాను అన్ని వాహన సంఘాలతో కలిసి విజయవంతం చేస్తామని ఆటో యూనియన్ జేఏసీ స్పష్టం చేసింది.

News November 5, 2024

HYD: మహిళపై ముగ్గురి అత్యాచారం

image

అమీర్‌పేట్: మధురానగర్ PS పరిధిలో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇళ్లలో పనికి వెళ్లే ఓ మహిళ నిన్న కొండాపూర్‌లో పనికెళ్లి తిరిగొస్తుండగా ఆటోలో ముగ్గురు వచ్చి తమ గదిలో బట్టలు ఉతకాలని చెప్పి ఆమెను తీసుకెళ్లి రూమ్‌లో బంధించారు. నోట్లో బట్టలు కుక్కి, తీవ్రంగా కొట్టి ఆమెపై అత్యాచారం చేశారు. తప్పించుకున్న ఆమె దుస్తులు లేకుండా బయటకు రాగా పక్కింటి మహిళ గమనించి నైటీ ఇచ్చారు. కేసు నమోదైంది.

News November 5, 2024

HYD: మీసేవ 14వ వార్షికోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

image

HYDలోని ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన మీ సేవ 14వ వార్షికోత్సవంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. మీ సేవ కేంద్రాలలో 150కిపైగా ప్రభుత్వ, 600 ప్రైవేట్ సంబంధిత ఆన్‌లైన్‌ చెల్లింపుల సేవలు సులువుగా అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు మీ సేవ కేంద్రాల ఏజెంట్లు పాల్గొన్నారు.