News September 5, 2024

HYD: బస్తీ దవాఖానాల్లో డెంగీ కిట్లు

image

జ్వరాలు, ఇతర వ్యాధులపై వైద్య, ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ, పల్లె దవాఖానాలలో అన్ని రకాల వైద్య పరీక్షలను చేస్తున్నారు. మందులను ఇవ్వడంతో పాటు డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే ప్రత్యేక కిట్ల ద్వారా పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేయనున్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే ప్రజలు అప్రమత్తం కావాలని, రోగులకు ఆందోళన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News October 27, 2025

HYD: చిన్న శ్రీశైలం సహా 99 మంది బైండోవర్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌తో కలిపి 100 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. నవీన్ యాదవ్ ర్యాలీలో రౌడీ షీటర్లు పాల్గొన్నారన్న ఆరోపణలతో EC ఆదేశాల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. బోరబండలో 74 మంది, మధురానగర్‌లో చిన్న శ్రీశైలం సోదరుడితో పాటు 19 మంది బైండోవర్ అయ్యారు. ఎన్నికల వేళ నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

News October 27, 2025

HYD: ఎన్నికల ఖర్చులు తనిఖీ చేయనున్న అధికారులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు తమ ఖర్చులు నమోదుచేసే రిజిస్టర్లను అధికారులు రేపు తనిఖీ చేయనున్నారు. పోటీలో ఉన్న 58 మంది అభ్యర్థులు తప్పని సరిగా చెక్ చేయించుకోవాలని ఎన్నికల పరిశీలకుడు సంజీవ్ కుమార్ లాల్ తెలిపారు. రేపటితోపాటు మరో 2 పర్యాయాలు (నవంబర్ 3, 9) రిజిస్టర్లను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు.

News October 27, 2025

జూబ్లీ బైపోల్స్: కీలకం కానున్న సినీ కార్మికులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సినీ కార్మికుల ఓట్లు కీలకం కానున్నాయి. షేక్‌పేట, బోరబండ, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, శ్రీనగర్‌కాలనీ, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో దాదాపు 24 వేల మంది సినీ కార్మికులున్నారు. దీంతో అభ్యర్థులు సినీ కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడుతున్నారు. అందుకే సినీ ప్రముఖుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుమన్ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు.