News October 18, 2024

HYD: బస్సుల్లో చిల్లర కష్టాలు తీరనున్నాయి..

image

ప్రయాణికులకు RTC గుడ్ న్యూస్ చెపింది. QR కోడ్ స్కాన్ చేసి టికెట్ పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. బండ్లగూడ, DSNR డిపో బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ తీసుకొచ్చి సక్సెస్ అయింది. అన్ని బస్సుల్లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి అవసరమైన 4,500 ఇంటెలిజెంట్ టికెటింగ్ యంత్రాలను (ITM) తీసుకురానుంది. అలాగే విద్యార్థుల బస్‌పాస్‌ల కోసం ప్రత్యేక యాప్ తీసుకురానుంది. దీంతో వారికి క్యూలైన్ కష్టాలు తీరతాయి.

Similar News

News November 3, 2025

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు ప్రకటన

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ చీఫ్ కోదండరాం తెలిపారు. షేక్‌పేట్‌ పరిధి ఓయూ కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రులు వివేక్, అజహరుద్దీన్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ జన సమితి మద్దతు కోరారని, ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.

News November 3, 2025

గ్రేటర్ హైదరాబాద్ PDSU నూతన కమిటీ ఎన్నిక

image

PDSU గ్రేటర్ హైదరాబాద్ జిల్లా నూతన కమిటీని ఈరోజు ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రాకేశ్, ప్రధాన కార్యదర్శిగా హరీశ్, ఉపాధ్యక్షులుగా నాగరాజు, నవీన్, రత్నాశేఖర్, సహాయ కార్యదర్శులుగా, సాయిప్రసాద్, దీక్షిత, శివ, సోషల్ మీడియా కన్వీనర్లుగా అనిల్, అభిరామ్, 24 మంది సిటీ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.

News November 3, 2025

HYD: KTR రోడ్ షో.. మహిళా టీమ్ INDIA ఫ్లెక్సీ

image

జూబ్లీహిల్స్ బోరబండలో ఈరోజు KTR రోడ్ షో నిర్వహించారు. వేలాది మంది జనం తరలిరాగా పలువురు నేతలు ప్రత్యేక ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ‘నిన్న భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ కొట్టారు.. రేపు జూబ్లీహిల్స్‌లో మహిళలు విజయం సాధిస్తారు’ ‘ఆడబిడ్డలు కాదు ఆది పరాశక్తులు’ అని రాసిన ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఆడబిడ్డకు, రౌడీ బిడ్డకు మధ్య జరిగే పోరాటంలో ప్రజలు ఆడబిడ్డ వైపే ఉంటారని BRS నేతలు అన్నారు.