News September 8, 2024
HYD: బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్

ఇటీవల ఐపీఎస్ బదిలీలో భాగంగా విజయ్ కుమార్ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన ఆదివారం మాజీ డైరెక్టర్ సీవీ. ఆనంద్ నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సీవీ. ఆనంద్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా సీవీ హైదరాబాద్ సీపీగా నియమితులయ్యారు.
Similar News
News November 3, 2025
HYD: ఘోరం.. ఉలిక్కపడ్డ మీర్జాగూడ

RTC బస్సు ప్రమాద ఘటనతో మీర్జాగూడ ఉలిక్కిపడింది. ఉ.6 గంటల వరకు అంతా ప్రశాంతంగా ఉంది. హైవే మీద ప్రమాదం జరిగిందని తెలుసుకున్న మీర్జాగూడ, ఇంద్రారెడ్డినగర్, బెస్తపూర్, ఖానాపూర్, కిష్టపూర్ వాసులు ఉలిక్కిపడ్డారు. ఏమైందోనని ఆందోళనతో కొందరు యువకులు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నారు. అప్పటికే రోడ్ల మీద మృతులు, కంకర కింద క్షతగాత్రులను చూసి చలించిపోయారు. కాగా, ఈ బస్సు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు.
News November 2, 2025
HYD: KCR వైపే ప్రజలు: మల్లారెడ్డి

KCR వైపే ప్రజలంతా ఉన్నారని మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డి అన్నారు. ఈరోజు జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్‌కు చెందిన 6వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పల్లపు రవి, 300 మంది కార్యకర్తలతో కలిసి BRSలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు. BRS మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, నాయకులు కొండల్ ముదిరాజ్, రాజశేఖర్, జిట్టా శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
News November 2, 2025
BREAKING: HYD: నవీన్ యాదవ్‌పై కేసు నమోదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. BRS పార్టీ కేడర్‌ను లేకుండా చేస్తానంటూ ఆయన బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. BRS కార్యకర్తల నుంచి బూత్ పేపర్లను లాక్కొని, వారిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు వీరిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు.


