News December 19, 2024
HYD: బాపుఘాట్ నుంచే మూసీ కలుషితం..!
మూసీ, ఈసా నదుల కలయిక అయిన బాపుఘాట్ నుంచి ఎప్పుడైతే మూసి HYDలోకి ప్రవేశిస్తుందో అక్కడి నుంచి మూసీ కలుషితం ప్రారంభమవుతుంది. బాపుఘాట్ ప్రాంతంలో నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ స్థాయి అమాంతం పడిపోతుంది. ఈ విషయాన్ని స్వయాన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కూడా తెలిపింది. గండిపేటలో-6 ఉండగా బాపుఘాట్ నుంచి ముసారంబాగ్, నాగోల్, నల్లచెరువు పీర్జాదిగూడ, ప్రతాపసింగారం ప్రాంతాల్లోనూ 0.3గా నమోదైంది.
Similar News
News January 19, 2025
HYD: OYO బంద్ చేయాలని డిమాండ్
OYO హోటల్స్ బంద్ చేయాలని HYD శివారులో ఆందోళన చేపట్టారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఓయో హోటల్‌లో మైనర్ బాలికపై అత్యాచారం, మంగళపల్లిలోని ఓ హాస్టల్‌లో ఉన్న విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ CPI నిరసన వ్యక్తం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు యాదయ్య అత్యాచారం జరిగిన OYO ముందు ధర్నా చేపట్టారు. ప్రధాన నిందితుడు, హోటల్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News January 18, 2025
ఉప్పల్‌లో బస్సు కింద పడి మృతి (UPDATE)
ఉప్పల్ డిపోనకు చెందిన RTC బస్సు కిందపడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటనసాయంత్రం జరిగింది. పూర్తి వివరాలు.. ఉప్పల్ బస్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు (TSU9Z 0280) నల్ల చెరువు మీదుగా వెళ్తోంది. కట్ట మీద ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా వెనుక టైర్ కింద పడ్డాడు. చక్రాలు అతని పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడ మృతి చెందారు. అతను ఎవరు? ఎందుకు బస్సు కింద పడి చనిపోయాడో వివరాలు తెలియాల్సి ఉంది.
News January 18, 2025
అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్ విచారణ
అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. అఫ్జల్ గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు దొంగలను ఆటో డ్రైవర్ తీసుకెళ్లారు. దొంగలను వదిలిపెట్టిన ఆటో డ్రైవర్‌ని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద దొంగల్ని వదిలిపెట్టినట్టు ఆటో డ్రైవర్ విచారణలో తెలిపారు. ఆటోలో కూర్చున్నప్పుడు దొంగలు ఏమైనా మాట్లాడుకున్నారా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.