News March 24, 2024

HYD: బాలానగర్‌లో యువకుడి దారుణ హత్య

image

ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన HYD బాలానగర్ PS పరిధిలో ఈరోజు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలానగర్ పరిధి APHB కాలనీలోని ఖాళీ ప్రదేశంలో ఉన్న ఓ బస్సులో స్థానికంగా నివాసం ఉండే పులి ప్రణీత్ తేజ అనే యువకుడిని అతడి స్నేహితుడే మద్యం మత్తులో నమ్మించి చంపేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 8, 2024

HYD: బస్సులో చోరీ ఘటనపై సీఐ వివరణ

image

బస్సులో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగులో నుంచి దుండగులు <<14559368>>బంగారు ఆభరణాలు చోరీ<<>> చేసిన ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ అంజిరెడ్డి వివరణ ఇచ్చారు. బాధితురాలు నార్కెట్‌పల్లి పరిధిలో ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించిన కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఎస్ఐ కరుణాకర్ రెడ్డి విచారించారన్నారు. అనంతరం బాధితురాలు నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్తామని తమకు సమచారం ఇచ్చారని తెలిపారు.

News November 8, 2024

అండర్-19లో మెరిసిన HYD ప్లేయర్

image

సికింద్రాబాద్ జింఖానా మైదానంలో గోవా జట్టుతో జరుగుతున్న కూచ్ బెహార్ ట్రోఫీ అండర్-19 క్రికెట్ టోర్నీ‌లో ఇవాళ్టి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ 136 ఓవర్లలో 604 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఓపెనర్‌గా వచ్చిన ఆరన్ 258 బంతుల్లో 219 రన్స్ చేసి వావ్ అనిపించారు.

News November 8, 2024

HYD: సీఎంపై అభిమానం.. రక్తంతో ఫొటో 

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని HYD ఓయూ జేఏసీ ఛైర్మన్ డాక్టర్ ఓరుగంటి కృష్ణ చాటుకున్నారు. రేవంత్ జన్మదినం సందర్భంగా తన రక్తంతో ముఖ్యమంత్రి చిత్రం వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంతన్న మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ముఖ్యమంత్రికి బహుమానంగా అందించనున్నట్లు వెల్లడించారు. ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డి అంటూ కొనియాడారు.