News September 8, 2024
HYD: బాలాపూర్ గణపతి ప్రత్యేకతలు ఇవే..!

HYD బాలాపూర్ గణపతిని కళాకారులు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. తలపై భాగంలో అమృతం కోసం సముద్ర మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహ చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడో చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
Similar News
News December 18, 2025
HYD: ‘హద్దు’లు దాటిన ‘విలీనం’

విస్తరణలో భాగంగా GHMC 300 డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై అభ్యర్థనలను నిన్నటి వరకు స్వీకరించింది. అయితే విభజించిన వార్డుల్లో తక్కువ, ఎక్కువ ఓటర్లు ఉన్నారంటూ, అసలు దేని ఆధారంగా ఈ ప్రక్రియ చేశారంటూ భగ్గుమన్నారు. స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. 3 వేలకుపైగా అభ్యర్థనలు వచ్చాయని అధికారులు తెలిపారు. డివిజన్లలో హద్దుల మార్పు ఏమైనా జరుగుతుందా, యథావిధిగా ఉంటుందా వేచి చూడాలి.
News December 17, 2025
HYD: ఇరానీ ఛాయ్‌తో ముస్కురానా!

HYD ఇరానీ ఛాయ్ హోటళ్లు ఇప్పుడు కేవలం చర్చా వేదికలు కావు, నవ్వుల అడ్డాలు! ఒకప్పుడు పాతబస్తీకే పరిమితమైన ఈ ఛాయ్ సంస్కృతి ఇప్పుడు హైటెక్స్ నుంచి ఎల్బీనగర్ వరకు కొత్త రూపం దాల్చింది. గ్లాసు ఛాయ్, ఉస్మానియా బిస్కెట్ కొరుకుతూ యువత పేలుస్తున్న ‘స్టాండప్ కామెడీ’ జోకులతో కెఫెలు దద్దరిల్లుతున్నాయి. ఇటు సంప్రదాయ ఇరానీ టేస్ట్, అటు మోడ్రన్ హ్యూమర్ కలగలిసి హైదరాబాద్ కల్చర్‌కు అదిరిపోయే గ్లామర్ తెస్తున్నాయి.
News December 17, 2025
RRలో బోణీ కట్టిన BRS.. బేగరికంచ సర్పంచ్‌గా వెంకటేశ్

3వ విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో BRS మద్దతుదారు బోణి కొట్టారు. కందుకూరు మండలం బేగరికంచ సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. BRS బలపరిచిన వాడ్యావత్ వెంకటేశ్ నాయక్ సమీప ప్రత్యర్థిపై 118 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 4 వార్డుల్లో BRS, మిగతా 4 వార్డుల్లో కాంగ్రెస్ వార్డు సభ్యులు విజయం సాధించారు. ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఉండే బేగరికంచలో BRS మద్దతుదారు గెలవడంతో శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.


