News September 16, 2024
HYD: బాలాపూర్ లడ్డూ వేలం పాటకు కొత్త రూల్
బాలాపూర్ గణపతి ఉత్సవంలో లడ్డూ వేలం వెరీ స్పెషల్. 1994లో రూ.450తో మొదలై 2023లో రూ.27 లక్షలకు పలికింది. అయితే, ఈసారి లడ్డూ వేలంపాటలో పాల్గొనే పోటీదారులు ముందస్తుగా గత సంవత్సరం పలికిన డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉందని నిర్వాహకులు తెలిపారు. బాలాపూర్ గ్రామ ప్రజలతో పాటు, ఎవరైనా ఈ వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలాపూర్ లడ్డూ వేలంపాట రేపు ఉదయం 9:30కు ప్రారంభం కానుంది.
Similar News
News November 17, 2024
ALERT: హైదరాబాద్ ఫుడ్ డేంజర్!
HYDలోని రెస్టారెంట్లలో క్వాలిటీ తగ్గుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ఇందుకు నిదర్శనం. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో HYD కల్తీలో నం.1 అని సర్వే పేర్కొంది. ఏకంగా 62% హోటళ్లు గడువు ముగిసిన ఆహార పదార్థాలు కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు పేర్కొంది. గడిచిన 2 నెలల వ్యవధిలోనే 84% ఫుడ్ పాయిజన్ కేసులు నగరంలో నమోదు కావడం గమనార్హం. దీంతో GHMC అప్రమత్తమైంది. అన్ని హోటల్స్‌లో తనిఖీలు చేపట్టింది.
News November 17, 2024
GROUP-3 EXAM: HYDలో సెంటర్ల వివరాలు
గ్రూప్-3 పరీక్షకు అంతా సిద్ధమైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 115 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 65,361మంది అభ్యర్థులు పరీక్ష హాజరుకావాల్సి ఉంది. రంగారెడ్డిలో 103 పరీక్ష కేంద్రాల్లో 56,394 మంది, హైదరాబాద్‌లో 102 కేంద్రాల్లో 45,918 మంది పరీక్ష రాయనున్నారు. మూడు జిల్లాల్లోనే ఏకంగా 1,67,673 మంది పోటీలో ఉండటం విశేషం. 10 AMకు పరీక్ష. గంట ముందే చేరుకోండి.
ALL THE BEST
News November 17, 2024
HYD: గ్రూపు-3 పరీక్షలకు అదనపు బస్సులు
ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్-3 పరీక్షల కోసం అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వినోద్‌కుమార్ తెలిపారు. ఉదయం, సాయంత్రం 2 విడతలుగా జరగనున్న పరీక్షల సమయానికి అనుగుణంగా ఉదయం 10 గంటల్లోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొనేలా బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. పరీక్షల అనంతరం సాయంత్రం తిరిగి గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు.