News February 5, 2025
HYD: బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరణ్ అనే యువకుడికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాలిలా.. సరూర్ నగర్ పరిధికి చెందిన కిరణ్ ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన 2020లో జరగ్గా కేసు నమోదైంది. తాజాగా కోర్టు శిక్ష విధించింది.
Similar News
News February 7, 2025
నార్సింగిలో బాలికపై సామూహిక అత్యాచారం

రాజేంద్రనగర్‌లోని నార్సింగి PS పరిధి దారుణం జరిగింది. హైదర్ షో కోట్‌లో 4 రోజుల క్రితం బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని బాధితులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
News February 7, 2025
HYD: స్కూల్ పిల్లల డేంజర్ జర్నీ

నిబంధనలు పాటించని స్కూల్ వ్యాన్‌లపై RTA అధికారులు <<15385435>>తనిఖీలు<<>> చేపట్టి సీజ్ చేస్తుంటే, మరికొందరు ఇవేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓమ్నీ వెహికల్‌లో ఓ డ్రైవర్ ఏకంగా 25 మందిని ఎక్కించాడు. నాదర్గుల్ నుంచి బడంగ్‌పేటకు వెళ్లే రూట్‌లో ఈ దృశ్యం కనిపించింది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులను ఇలా తీసుకెళ్లడం ఏంటని స్థానికులు నిలదీశారు. వ్యాన్ మీద, డోర్లు ఓపెన్ చేసి ప్రమాదకరంగా తరలించడం గమనార్హం.
News February 7, 2025
HYD: దారుణం.. మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం

మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం చేశాడు. మేడ్చల్ పోలీసుల వివరాలు.. ఓ కేసు కోసం PSకు వచ్చిన మహిళ(31)తో PC సుధాకర్ పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఇంటికి పిలిచి పలుమార్లు అత్యాచారం చేశాడు. గర్భం దాల్చడంతో అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. చివరకు అతడి భార్య, స్నేహితుడితో కలిసి దాడి చేయించడంతో బాధితురాలు PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.