News February 5, 2025
HYD: బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరణ్ అనే యువకుడికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాలిలా.. సరూర్ నగర్ పరిధికి చెందిన కిరణ్ ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన 2020లో జరగ్గా కేసు నమోదైంది. తాజాగా కోర్టు శిక్ష విధించింది.
Similar News
News November 20, 2025
ఏపీని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తాం: DGP

AP: 2026 మార్చి నాటికి రాష్ట్రంలో మావోయిజాన్ని అంతం చేస్తామని DGP హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. రంపచోడవరంలోని AOB ప్రాంతంలో ఆయన ఏరియల్ సర్వే చేశారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. 50 మంది మావోలను అరెస్ట్ చేశామన్నారు. APని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తామని, ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
News November 20, 2025
గాంధీ ఆస్పత్రికి బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు చర్యలు

HYD గాంధీ ఆస్పత్రికి కొత్త బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం అధికారులు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను సందర్శించి అక్కడి అధునాతన వైద్య విధానాలను పరిశీలించారు. కార్పొరేట్ స్థాయి సేవలు అందించే విధంగా గాంధీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపాదిత మోడల్స్‌కు ఆమోదం వచ్చిన వెంటనే ఆధునీకరణ పనులు ప్రారంభమవుతాయన్నారు.
News November 20, 2025
SKLM: ‘సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి’

సివిల్ సర్వీస్ ఉచిత కోచింగ్ పొందేందుకు నవంబర్ 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 80 ఫీట్ రోడ్డులో గల బీసీ స్టడీ కార్యాలయంలో ధ్రువపత్రాలను సమర్పించిన అనంతరం డిసెంబర్ 5న వెరిఫికేషన్ స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. కుల ప్రాతిపదిక పైన ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 10 నుంచి విజయవాడలోని గొల్లపూడి సర్కిల్లో ఉచిత కోచింగ్ ఇస్తారన్నారు.


