News February 5, 2025
HYD: బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరణ్ అనే యువకుడికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాలిలా.. సరూర్ నగర్ పరిధికి చెందిన కిరణ్ ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన 2020లో జరగ్గా కేసు నమోదైంది. తాజాగా కోర్టు శిక్ష విధించింది.
Similar News
News February 13, 2025
రైతులకు 9 గంటల విద్యుత్ అందాల్సిందే: మంత్రి గొట్టిపాటి

AP: వేసవిలో విద్యుత్ కోతలు ఉండరాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ అందాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల పరికరాల బిల్లులను చెల్లించారనే ఆరోపణలపై ఎస్పీడీసీఎల్ ఎండీ సంతోష్‌రావును వివరణ కోరారు. ఈ విషయంలో సీఎం అసంతృప్తిని ఎండీకి వివరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పనిచేయాలని సూచించారు.
News February 13, 2025
బాపట్ల: స్కానింగ్ సెంటర్లను నిరంతరం తనిఖీ చేయాలి

స్కానింగ్ సెంటర్లను వైద్యశాఖ అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని బాపట్ల ఆర్డీవో గ్లోరియా చెప్పారు. గురువారం బాపట్ల ఆర్డీవో కార్యాలయం నందు సబ్ డిస్ట్రిక్ లెవల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆడపిల్లల ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News February 13, 2025
కలికిరి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరు మృతి

కలికిరి మండలం మహాల్ పంచాయతీ ఈతమాను వడ్డిపల్లి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ రఫిక్ ఖాన్ (57), బుజ్జమ్మ (40) అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలో రఫిక్ ఖాన్ మృతి చెందాడు. బుజ్జమ్మ రుయాలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కలికిరి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.