News January 7, 2025
HYD: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు
HYDలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. 2018లో వనస్థలిపురం PS పరిధిలో తాపీ మేస్త్రిగా పనిచేసే కార్తిక్(22) ఓ బాలికను ప్రేమపేరుతో మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.
Similar News
News January 9, 2025
లా కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ లా కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. మూడేళ్ల LLB, LLB ఆనర్స్, ఐదేళ్ల బీఏ LLB, ఐదేళ్ల బీకామ్ LLB, ఐదేళ్ల బీబీఏ LLB తదితర కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు.
News January 9, 2025
HYD: జీడిపప్పుతో ఆరోగ్యానికి బోలెడు లాభాలు!
✓జీడిపప్పు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
✓చర్మ సంరక్షణకు దోహదపడుతుంది
✓మెదడు పనితీరును సైతం మెరుగుపరుస్తుంది
✓కంటి చూపును సైతం మెరుగుపరిచే శక్తి ఉంది
✓ఎముకలు బలంగా ఉండటానికి సహకరిస్తుంది
✓రక్తంలోని చక్కర స్థాయిలను సైతం కంట్రోల్ చేస్తుంది.
•జీడిపప్పు తినడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని TGFPS-RR అనేక తెలిపారు.
News January 9, 2025
HYD: త్వరలో HMDA ప్లాట్లు మరోసారి వేలం!
HYD మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 1,500 నుంచి 2,000 ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో పలు దఫల్లో వేలం వేసినా మిగిలిపోయాయి. అయితే తాజాగా..మరోసారి వేరే వేయాలని నిర్ణయించారు. 8-14 అంతస్తుల అపార్ట్మెంట్ టవర్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది. దీంతో రాజీవ్ స్వగృహ ఇండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది.