News April 25, 2024
HYD: బాలికపై బైక్ మెకానిక్ అత్యాచారం
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత కఠిన కారాగార శిక్ష విధించినట్లు లంగర్‌హౌస్ CI రఘుకుమార్ తెలియజేశారు. 2021 సంవత్సరంలో లంగర్‌హౌస్‌లోని గాంధీ విగ్రహం సమీపంలో ఉండే అతిక్ ఖాన్ అనే బైకు మెకానిక్ బాలికపై అత్యాచారం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై అభియోగపత్రం దాఖలు చేశారు. మంగళవారం నాంపల్లి 12వ మెట్రోపాలిటన్ కోర్టు అడిషనల్ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
Similar News
News January 26, 2025
HYD: మెట్రో స్టేషన్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటీలు, కార్లు..!
హైదరాబాద్‌లో మెట్రో ఫస్ట్, లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ వద్ద దాదాపు 100 ఎలక్ట్రిక్ కార్లు, ఉమెన్ డ్రైవెన్ ఎలక్ట్రిక్ స్కూటీలను ప్రారంభించినట్లు మెట్రో ఎండి NVS రెడ్డి తెలిపారు.ఈ వాహనాలు మల్కాజిగిరి, ఈసీఐఎల్, సైనిక్‌పురి ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తాయని, త్వరలో అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ఈ సర్వీసులు తెస్తామన్నారు.
News January 26, 2025
నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు..
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 76వ రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు నగరంలో ఉ.7:30 నుంచి ఉ.11:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. అలాగే సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం ఉండటంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
News January 26, 2025
HYD: పాతబస్తీ మెట్రో.. రూ.80 కోట్ల చెక్కులు!
HYD పాతబస్తీ మెట్రోపై ఎండీ NVS రెడ్డి కీలక అప్డేట్ అందించారు. పాతబస్తీలో రోడ్ల విస్తరణ కోసం 1100 నిర్మాణాలను తొలగించాల్సి ఉందని, ఇందులో 270 మంది స్వచ్ఛందంగా ఆస్తి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, వీరిలో మొత్తం 170 మందికి పరిహారం కింద ఇప్పటికే రూ.80 కోట్ల చెక్కులను పంపిణీ చేసినట్లుగా వెల్లడించారు. కేంద్రం అనుమతి రాగానే మెట్రో రెండో దశ ప్రారంభిస్తామన్నారు.