News April 16, 2025

HYD: బాలికపై లైంగికదాడికి యత్నం

image

బాలికపై లైంగిక దాడికి యత్నించిన మారుతండ్రిపై కేసు నమోదైంది. HYD కమలావరి కాలనీలో నివాసముండే ఓ మహిళ భర్తతో విడిగా కుమార్తె(10)తో కలిసి ఉంటుంది. కాకినాడకు చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. HYDలో ఇద్దరు సహజీవనం చేయడం ప్రారంభించారు. మహిళ గర్భవతి అయింది. ప్రసవానికి ఆస్పత్రికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె కుమార్తెపై మారుతండ్రి కన్నెసి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక స్థానికుల సాయంతో PSలో కంప్లైంట్ చేసింది.

Similar News

News September 19, 2025

ప్రతిభ చూపితే చాలు ఏటా రూ.12వేలు!

image

ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థుల నుంచి NMMS పరీక్షలకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా రూ.12వేల సాయం లభిస్తుంది. దరఖాస్తులు ఈ నెల 30లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి. రీజనింగ్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో 3గంటల పాటు పరీక్ష నిర్వహిస్తారు. గతేడాది కర్నూలు జిల్లాలో 8,551 మంది పరీక్ష రాయగా 443 మంది అర్హత సాధించారు.

News September 19, 2025

నేడే కృష్ణా జిల్లా ఎస్జీఎఫ్ షూటింగ్ జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) ఆధ్వర్యంలో నేడు అండర్-14, 17 బాల, బాలికల షూటింగ్ జట్ల ఎంపికలు జరగనున్నాయి. భవానిపురంలోని గ్లోరియస్ స్పోర్ట్స్ అకాడమీలో ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఎంపికలకు హాజరయ్యే క్రీడా కారులు తమ స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, పాఠశాల హెచ్ఎం సంతకం, సీల్‌తో ఉన్న ఎంట్రీ ఫారం తీసుకురావాలని SGF కార్యదర్శులు దుర్గారావు, రాంబాబు తెలిపారు.

News September 19, 2025

తెర్లాం: తండ్రిని చంపిన కసాయి కొడుకు

image

క్షణికావేశంలో కన్న తండ్రినే చంపాడు కసాయి కొడుకు. తెర్లాం (M) ఎంఆర్.అగ్రహారానికి చెందిన అప్పలస్వామికి ఇద్దరు కొడుకులు. తన గురించి ఊరంతా చెడుగా చెబుతున్నాడంటూ చిన్న కుమారుడు శంకరరావు తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈక్రమంలోనే కోపంలో రాయితో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అప్పలస్వామిని మనవరాలు కల్పన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.